రాష్ట్రీయం

చంద్రబాబుది నయవంచన దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 2: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించేందుకు అనుకూలంగా లేఖ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నవ నిర్మాణ దీక్షను చేయడం వింతగా ఉందని ప్రతిపక్ష పార్టీ వైకాపా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలో గురువారం నవ నిర్మాణ దీక్ష చేయలేదని, ఇదంతా నయ వంచన దీక్ష అని ఆ పార్టీ విమర్శించింది. అవినీతి మీద, కుట్ర రాజకీయాల మీద ప్రజలు ధ్వజం ఎత్తాలన్న నవ నిర్మాణ దీక్ష, ప్రతిజ్ఞ ప్రకారం ప్రజల తొలి లక్ష్యం ఇక చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే కావాలన్నారు. ఓటుకు నోటు కేసులో బయటపడేందుకు కృష్ణా, గోదావరి నదులను తెలంగాణ ప్రభుత్వానికి, అవినీతి అక్రమాలపై సిబిఐ విచారణ జరగకుండా ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టేసి ఏపి అభివృద్ధిని, ప్రాణాధారమైన జలాలను కూడా అమ్మేసిన చంద్రబాబు, ఈ రోజు చేసేది నిర్మాణ దీక్ష అంటే ఎవరైనా నమ్ముతారా అని వైకాపా ప్రశ్నించింది.
ప్రతి ఒక్కరూ దీక్షలో పాల్గొనాలని, 11 గంటలకు ఎక్కడి వారక్కడ నిలిచిపోవాలన్నారు. చివరకు నియంతృత్వ దేశాల్లో కూడా చేయని వెర్రిమొర్రి ఆలోచనలకు ఎమర్జెన్సీని మించిన దుష్టపోకడలకు చంద్రబాబు బుర్ర కేంద్ర స్థానంగా మారిందన్నారు. గత రెండేళ్లుగా చెప్పుకోదగిన ఒక మంచి సంక్షేమ పథకాన్ని అమలు చేయలేదని, స్కాములతో కాలక్షేపం చేశారన్నారు. కృష్ణా, గోదావరి ద్వారా రావాల్సిన నికర జలాల్లో చుక్కను వదులుకోబోమన్న భరోసా లేదన్నారు. ప్రత్యేక హోదా తీసుకువస్తామన్న హామీ అమలు చేసేందుకు ఎటువంటి ప్రయత్నం చేయలేదన్నారు. విభజన చట్టాన్ని అమలు చేయించే ప్రయత్నమే లేదన్నారు. పారిశ్రామిక రాయితీలు లేవన్నారు. ఉద్యోగ అవకాశాల ఊసు లేదన్నారు. ఇప్పుడేం జరుగుతుందో చెప్పే ధైర్యం టిడిపి ప్రభుత్వానికి లేదన్నారు. మూడేళ్లలో ఏమి పూర్తి చేస్తారో చెప్పగల సత్తా బాబుకు లేదన్నారు. హిట్లర్ ఆలోచన ధోరణికి కొనసాగింపే ఈ నాటకమని, చంద్రబాబు పాలన భయానకం, మాటలు బూటకమని వైకాపా విమర్శించింది.