రాష్ట్రీయం

శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు కుటుంబం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, జూన్ 2: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం గురువారం దర్శించుకుంది. సిఎం సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణి, వారి కుమారుడు దేవాన్ష్ తదితరులు శ్రీవారి దర్శనార్థం గురువారం ఉదయం 9గంటలకు తిరుమలకు చేరుకున్నారు. రెండో పర్యాయం దేవాన్ష్‌కు తలనీలాలు సమర్పించారు. అనంతరం వెంటనే స్వామివారిని దర్శించుకోవాలని భావించారు. అయితే ఆ సమయంలో వివిఐపిలకు కూడా ప్రత్యేక దర్శన సౌకర్యం లేకపోవడంతో సాధారణ భక్తులు దర్శనం చేసుకున్న విధంగా మహాలఘులో స్వామివారిని దర్శించుకుని ఎంతో మందికి మార్గదర్శకులయ్యారు. అంతకుముందు వీరు పద్మావతి అతిథిగృహాల వద్దకు చేరుకోగానే రిసెప్షన్ అధికారులు సాదరస్వాగతం పలికి వసతి ఏర్పాటు చేశారు. అనంతరం దేవాన్ష్‌కు తలనీలాలు సమర్పించి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. కొద్ది సేపు విరామం అనంతరం రూ.300 ప్రత్యేక ప్రవేశ టికెట్లను తీసుకుని సుపథం ప్రవేశమార్గం ద్వారా ఆలయంలోకి చేరుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద వారికి టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, జెఇఒ శ్రీనివాసరాజు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి సన్నిధికి చేరుకుని మహాలఘు దర్శనంలో శ్రీవారిని దర్శించుకుని వకుళామాతకు నమస్కరించుకుని హుండీలో కానుకలు సమర్పించి ధ్వజస్తంభానికి మొక్కుతూ రంగనాయక మండపానికి చేరుకున్నారు. ఇక్కడ వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా టిటిడి చైర్మన్, జెఇఓలు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని బహూకరించారు.

చిత్రం శ్రీవారిని దర్శించుకుని వెలుపలకు వస్తున్న ఏపి సిఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి తదితరులు