రాష్ట్రీయం

మత్తయ్యకు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 3: ఓటుకు నోటు కేసులో నాల్గవ నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్యపై తెలంగాణ ఏసిబి నమోదు చేసిన క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో మత్తయ్యకు ఊరట లభించింది. ఓటుకు నోటు కేసు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. జస్టిస్ బి శివశంకర్ రావు కేసును విచారించారు. తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మత్తయ్య పెట్టుకున్న పిటిషన్‌ను విచారించి క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను కొట్టివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. మత్తయ్యపైన అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయడం సరైన విధానం కాదన్నారు. ఈ సెక్షన్లు పబ్లిక్ సర్వెంట్లు అవినీతికి పాల్పడడం, లేదా అవినీతికి ప్రయత్నించడానికి సంబంధించిన కేసులని కోర్టు పేర్కొంది. గత ఏడాది తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్, తాను తేదాపాకు అనుకూలంగా ఓటు వేస్తే రూ. 50 లక్షల సొమ్ము ఇస్తామని ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తదితరులు ఆశ చూపారని ఏసిబికి ఫిర్యాదు చేశారు. దీంతో ఏసిబి రంగంలోకి దిగి రేవంత్‌రెడ్డి, సహకరించిన బిషప్ హారీ సెబాష్టియన్, ఉదయసింహ, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను అరెస్టు చేయడం, వీరంతా బెయిల్‌పై విడుదలవడం తెలిసిందే. కేసులో మత్తయ్య పాత్రపైనా ఏసిబి కేసు నమోదు చేస్తే, తాను నిరపరాధినని మత్తయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.