రాష్ట్రీయం

మైత్రీ బంధంలో కొత్త శకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 3: భారత్- అమెరికాలు సహజ మిత్ర దేశాలని, ప్రధాని నరేంద్ర మోదీ చొరవ, పర్యటనల వల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్య ద్వైపాక్షిక సంబంధాల్లో నూతన శకం ప్రారంభమైందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని, ఇక్కడ అద్భుతమైన వాణిజ్య అవకాశాలున్నాయని పిలుపునిచ్చారు. అమెరికాలో ఉన్న భారత్ ఐటి ఉద్యోగులకు వీసా నిబంధనలను సరళతరం చేసేందుకు అమెరికా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. శుక్రవారం ఇక్కడ ఇండో అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ 2009-10లో ఇరు దేశాల మధ్య వాణిజ్యం విలువ 90 బిలియన్ల డాలర్లు ఉండగా, 2014-15కు 100 బిలియన్ డాలర్లకు చేరుకుందన్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు గతంలో ఉన్న అవరోధాలను తొలగిస్తున్నట్లు ఆయన చెప్పారు. వన్ టైం సెక్యూరిటీ క్లియరెన్సు విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. సెక్యూరిటీ క్లియరెన్సు రెన్యువల్‌ను 3 నుంచి 10 సంవత్సరాలకు పెంచామన్నారు. కొన్ని కేటగిరీల వీసాల ఫీజును పెంచారని, దీనిని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 7న అమెరికా పర్యటనలో ప్రధాని మోదీ ఈ విషయాన్ని ఆ దేశాధ్యక్షుడితో చర్చిస్తారని రాజ్‌నాథ్ చెప్పారు. గత ఆర్ధిక సంవత్సరంలో భారత్ 15 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించిందన్నారు. గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ దేశంలో ప్రత్యేకంగా ఆంధ్ర, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మంచి వాతావరణం ఉందన్నారు. రాజకీయ సుస్థిరత వల్ల రెండు రాష్ట్రాలూ ప్రగతిని సాధిస్తున్నాయన్నారు. అమెరికా కాన్సుల్ జనరల్ మైకేల్ ముల్లిన్స్ మాట్లాడుతూ వాణిజ్య రంగంలో పెట్టుబడులను విస్తృతం చేసేందుకు ఇరు దేశాల మధ్య సహాయ సహకారాలు కొనసాగుతున్నాయన్నారు.
chitram...
శుక్రవారం హైదరాబాద్‌లో ఇండో అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ సదస్సు ప్రారంభించి సావనీర్‌ను విడుదల చేస్తున్న కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్. గవర్నర్ నరసింహన్