రాష్ట్రీయం

కర్నాటక బస్సుకు తప్పిన ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు/ఆదోని, జూన్ 4: కర్నూలు జిల్లాలో శనివారం ఉదయం కర్నాటక రోడ్డు రవాణా సంస్థ బస్సుకు పెనుప్రమాదం తప్పింది. హంద్రీనది వరదలో చిక్కుకున్న బస్సు ప్రయాణికులను సమీప గ్రామస్థులు సురక్షితంగా బయటకు తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరో సంఘటనలో కల్లేవంక వాగులో జొన్నల లారీ బోల్తా పడడంతో అందులోని ముగ్గురిని పోలీసులు రక్షించారు. శనివారం తెల్లవారుజామున జిల్లాలో భారీవర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పత్తికొండ మండలం చిన్నహుల్తి గ్రామం వద్ద హంద్రీనదికి వరద పోటెత్తింది. వరదనీరు వంతెన మీదుగా ప్రవహించడంతో ఇరువైపుల వాహనాలు బారులుతీరాయి. తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో బెంగళూరు నుంచి మంత్రాలయం వెళ్తున్న కర్నాటక బస్సు అక్కడికి చేరుకుంది. ఇతర వాహనాల డ్రైవర్లు వారించినా వినకుండా కర్నాటక బస్సు డ్రైవర్ వంతెన దాటే ప్రయత్నం చేయగా సైలెన్సర్‌లోకి నీరుచేరి ఇంజన్ ఆగిపోవడంతో బస్సు నది మధ్యలో ఆగిపోయింది. దీంతో బస్సులోని సుమారు 50 మంది ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేశారు. సమాచారం అందుకున్న చిన్నహుల్తి గ్రామస్థులు, పోలీసులు వంతెన వద్దకు చేరుకుని ప్రయాణికులకు ధైర్యం చెప్పారు. కొంతమంది తాళ్ల సాయంతో బస్సు వద్దకు చేరుకున్నారు. ఎవరూ బస్సు నుంచి దిగవద్దని ధైర్యం చెప్పి తాళ్లసాయంతో బస్సును బయటకు లాగే ప్రయత్నం చేశారు. వరద మరింత పెరగడంతో బస్సు లోపలికి నీళ్లు చేరాయి. ఇంతలో మరికొంత మంది యువకులు చేరి దాదాపు గంటసేపు శ్రమించి బస్సును వరదనీటి నుంచి బయటకు లాగారు. అనంతరం బస్సు ప్రయాణికులకు అల్పాహారం అందించారు. మరమ్మతుల అనంతరం 11 గంటల ప్రాంతంలో బస్సు బయలుదేరింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మరో సంఘటనలో ఆలూరు మండలం కల్లెవంక వాగులో జొన్నల లారీ బోల్తాపడింది. శనివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి మొలగవళ్ళికి జొన్నల లోడుతో వస్తున్న లారీ వాగు దాటుతుండగా వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. లారీ డ్రైవర్ విజయకుమార్, వ్యాపారులు పరుశురామ్, కాశీవిశ్వనాథ్ లారీలోనే చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో వారిని ప్రాణాలతో కాపాడారు.

చిత్రం హంద్రీనది వరదలో చిక్కుకున్న కర్నాటక బస్సును బయటకు లాగుతున్న దృశ్యం