రాష్ట్రీయం

పరస్పర సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 4: వివిధ రంగాల్లో పరస్పర సహకారం కోసం టి-హబ్ కాలిఫోర్నియా రాష్ట్రం ఎంఓయు కుదుర్చుకున్నాయి. ఈ అంశంపై కాలిఫోర్నియాతో గతంలోనే ఐటి మంత్రి కె తారక రామారావు ప్రాథమికంగా చర్చలు జరిపారు. అమెరికా పర్యటనలో ఉన్న కెటిఆర్ కాలిఫోర్నియా ప్రభుత్వంతో ఈమేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. కెటిఆర్ నాయకత్వంలోని బృందం, కాలిఫోర్నియ గవర్నర్ ఆఫీసు ఈమేరకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రత్యామ్నాయ ఇంధనం, ఎన్విరాన్‌మెంటల్ టెక్నాలజీ, ఆరోగ్యం, వ్యవసాయం, టెక్నాలజీ ఆధారిత పరిశ్రమలు, రిసెర్చ్, డెవలప్‌మెంట్ తదితర అంశాల్లో పరస్పరం సహకరించుకుంటారు. ఈ ఒప్పందాల వల్ల పరస్పరం ప్రయోజనం పొందుతామని కెటిఆర్ చెప్పారు. స్టార్టప్స్‌లో తెలంగాణ, సిలికాన్ వ్యాలీ మధ్య అనుబంధం ఏర్పడుతుందన్నారు. భారతదేశంలోని కంపెనీలకు, కాలిఫోర్నియా కంపెనీలకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని కాలిఫోర్నియా గవర్నర్స్ ఆఫీస్ ఆఫ్ బిజినెస్, ఎకనామిక్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ పనోరియా తెలిపారు. ఒప్పందంపై ఆయన సంతకం చేశారు. తెలంగాణ తరఫున తెలంగాణ ఐటి కార్యదర్శి సంతకాలు చేశారు. డైరెక్టర్ డిజిటల్ మీడియా దిలీప్‌కొణతల తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఒప్పందం మేరకు వివిధ రంగాల్లో పరస్పరం టి-హబ్, కాలిఫోర్నియా సహకరించుకుంటాయి.

చిత్రం ఒప్పందాలు కుదుర్చుకున్న టి-హబ్, కాలిఫోర్నియా అధికారులు