రాష్ట్రీయం

మూడు రోజులపాటు వానలే వానలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 4: తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలను మూడు రోజులపాటు జడివానలు ముంచెత్తనున్నాయి. రాగల 72 గంటలపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. కోస్తాంధ్రలో భారీ వర్షాలు ఉంటాయని ఐఎండి శాస్తవ్రేత్త ‘ఎఫ్’ (ఎన్‌డబ్ల్యుఎప్‌సి) డాక్టర్ రంజీత్ సింగ్ వెల్లడించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇక వేడిగాడ్పులేమీ ఉండవన్నారు. బంగాళాఖాతం, దక్షిణ ఒడిశా నుండి ఏపీ తెలంగాణ మీదుగా తమిళనాడు వరకు ఉపరితలద్రోణి ఏర్పడి ఉందని, ఇది స్థిరంగా కొనసాగుతోందని వివరించారు. ఈ కారణంగా గత రెండు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో గత ఇరవై నాలుగు గంటల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షం కురిసింది. మంగళగిరి (గుంటూరు), డోన్ (కర్నూలు)లలో ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే ఏలూరు, గుంటూరు, విజయవాడ, హోళగుండ, పగిడ్యాల (కర్నూలు)లలో ఆరేసి సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోస్తా, రాయలసీమ, తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో గడచిన 24 గంటల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నైరుతీ రుతుపవనాలు ఇంకారాలేదని, అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రుతుపవనాల ముందస్తు వర్షాలేనని వివరించారు. అరేబియా సముద్రంలో ఉపరితల ద్రోణి ఏర్పడి ఉందని, దీని ప్రభావం వల్ల నైరుతీ రుతుపవనాలు ముందుకు సాగేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని వివరించారు.