రాష్ట్రీయం

6.5 వేల కోట్లివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 4: రాష్ట్రంలో పెండింగ్‌లోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తికి 6500 కోట్లు మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్ర జలవనరుల పార్లమెంటరీ సభ్యుల బృందం శనివారం హైదరాబాద్‌లో సమావేశమైంది. తెలంగాణ విజ్ఞప్తిపై పార్లమెంటరీ బృందం సానుకూలంగా స్పందించింది. కేంద్రానికి ఈ అంశంపై తాము నివేదిక ఇస్తామని కమిటీ చైర్మన్ హుకుంసింగ్ హామీనిచ్చారు. సత్వర సాగునీటి ప్రయోజనాల పథకం (ఎఐబిపి) కింద 2,155 కోట్లు ఇవ్వాలని, నాబార్డు నుంచి 4280 కోట్లు మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. తెలంగాణలో జలవనరులను సద్వినియోగం చేసుకునేందుకు చేపట్టిన పథకాలు, సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై పార్లమెంటరీ కమిటీ శనివారం నోవాటెల్‌లో సమావేశమైంది. ప్రజలకు రక్షిత మంచినీటిని ఎలా సరఫరా చేస్తున్నారు, భూగర్భ జలాల పెంపుదలకు తీసుకుంటున్న చర్యలు, చెరువుల్లో, సరస్సుల్లో నీరు కలుషితం కాకుండా చేపడుతున్న కార్యక్రమాల గురించి పార్లమెంటు బృందం అడిగి తెలుసుకుంది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు యావత్ దేశానికి మోడల్‌గా నిలిచాయని 17మంది సభ్యులతో కూడిన పార్లమెంటరీ బృందం ప్రశంసలు కురిపించింది. కృష్ణా గోదావరి నదీ యాజమాన్యం బోర్డుల పనితీరును బృందం అడిగి తెలుసుకుంది. కృష్ణా బోర్డు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ తెలంగాణకు అన్యాయం చేస్తోందని అధికారులు ఈ బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఎఐబిపి కింద 2155 కోట్ల రూపాయలు మంజూరు చేసేలా కేంద్రాన్ని ఒప్పించాలని కోరారు. నాబార్డ్ నుంచి 4280 కోట్ల రుణం ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈ అంశాల్లో తెలంగాణకు సానుకూలంగా నిర్ణయం తీసుకునేట్టు కేంద్రాన్ని ఒప్పిస్తామని పార్లమెంటు సభ్యుల బృందం తెలిపింది.

చిత్రం తెలంగాణ ప్రాజెక్టులపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న పార్లమెంట్ సభ్యుల బృందం