రాష్ట్రీయం

బోర్డుపై తాడో పేడో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 4: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఏకపక్షంగా వ్యవహరిస్తూ తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతినేలా వ్యవహరిస్తోందని, దీన్ని సీరియస్‌గానే ఎదుర్కోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. బోర్డు వ్యవహారంపై రాష్ట్రంలోని బిజెపి మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. నగరంలో పర్యటిస్తున్న పార్లమెంటరీ కమిటీ దృష్టికి సైతం కృష్ణా బోర్డు వ్యవహారాన్ని తీసుకెళ్లారు. ఎంపీ హుకుంసింగ్ చైర్మన్‌గా ఉన్న పార్లమెంటరీ కమిటీ హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో శనివారం సమావేశమైంది. కృష్ణా, గోదావరి బోర్డుల పనితీరును ఈ బృందం సమీక్షించింది. ఈ సందర్భంగా అధికారులు కృష్ణా బోర్డు ఏకపక్ష నిర్ణయాలు, వీటివల్ల తెలంగాణకు కలిగే నష్టాలను పార్లమెంట్ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. ఇదే అంశంపై కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతికి ఫిర్యాదు చేసేందుకు నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు నాయకత్వంలో ఎంపీలు, ఇరిగేషన్ శాఖ అధికారుల బృందం ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా, సోమవారానికి వాయిదా పడింది. అధికారులు అందుబాటులో లేనందున సమావేశం వాయిదా వేస్తున్నట్టు, సోమవారం సమావేశం అవుదామని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి హరీశ్‌రావుకు ఫోన్ చేసి చెప్పారు. ముందుగా నిర్ణయమైన సమావేశానికి అధికారులు అందుబాటులో లేకపోవడం విశేషం. సమస్య గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ఉద్దేశంతోనే కేంద్ర మంత్రి సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేశారని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా కేంద్రంలో బిజెపి అధికారంలో ఉండటంతో కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరగకుండా బిజెపి సైతం జోక్యం చేసుకోవాలని మంత్రులు కోరుతున్నారు. నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను శనివారం ఉదయం కలిసి కృష్ణా బోర్డు తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని వివరించారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేలా సహకరించాలని కోరారు. కృష్ణా బోర్డు వైఖరివల్ల తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయకు అందజేసిన లేఖలో హరీశ్‌రావు వివరించారు. ఇదే అంశాన్ని పార్లమెంటరీ బృందానికి తెలంగాణ నీటిపారుదల అధికారులు తెలిపారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ పూర్తి కాకముందే నదీ జలాల పంపిణీని తమ నియంత్రణలోకి తీసుకోవడానికి కృష్ణా బోర్డు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కృష్ణా నదీ జలాలను వినియోగిస్తున్న ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలను సంప్రదించకుండా బోర్డు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేలేంతవరకు బచావత్ నోటిఫికేషన్ జారీ చేయవద్దని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఇప్పటి వరకు బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారమే పంపిణీ జరుగుతున్నదని, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గడువును కేంద్రం రెండేళ్లపాటు పొడిగించిన విషయాన్ని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏళ్ళపాటు సాగునీటి రంగంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని, ఈ అన్యాయాన్ని తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా కొనసాగించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరగలేదని చెప్పారు. బోర్డు ఆంధ్రప్రదేశ్ ఒత్తిళ్లకు తలొగ్గుతోందని ఆరోపించారు. రాష్ట్రాల పునర్వీభజన చట్టంలోని 87 (1), 85 (8) సబ్ సెక్షన్‌ల ప్రకారం కృష్ణా బోర్డు ముసాయిదా నోటిఫికేషన్ తయారు చేయలేదని ప్రభుత్వం తెలిపింది. బండారు దత్తాత్రేయను కలిసి బోర్డు ఏకపక్ష నిర్ణయాలపై హరీశ్‌రావు సవివరంగా చెప్పారు.
తెలంగాణ ప్రయోజనాల కోసం పూర్తిగా సహకరిస్తానని బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారు. కృష్ణా నదిలో తెలంగాణకు న్యాయమైన వాటా కోసం అన్ని పార్టీల మ్దదతు కూడగట్టాలని తెరాస ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సైతం కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాపై ప్రభుత్వానికి అండగా నిలుస్తామని ప్రకటించారు. సోమవారం రోజున ఈ అంశాలన్నింటినీ పూర్తి వివరాలతో కేంద్ర జలవనుల శాఖ మంత్రి ఉమాభారతికి హరీశ్‌రావు బృందం వివరిస్తుంది.