రాష్ట్రీయం

‘కొవ్వాడ’ పనులు చకచకా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 4: ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ వద్ద తలపెట్టిన 9564 మెగావాట్ల అణు విద్యుత్ ప్లాంట్ పనులు స్పీడందుకున్నాయి. కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలోని ఉన్నత స్ధాయి నిపుణులు ఈ నెలలో అణు విద్యుత్ ప్లాంట్ సైట్‌ను సందర్శించి పర్యావరణ ప్రభావంపై అధ్యయనం చేయనున్నారు. ఇందులో భాగంగా సామాజిక ప్రభావిత అంచనా అధ్యయనం కూడా చేసి కేంద్రానికి వెంటనే నివేదిక ఇవ్వనున్నారు. మరో వైపు భూమి సర్వే పనులు కూడా ఊపందుకున్నాయి. సర్వే పనులు ఒకటి రెండు రోజుల్లో పూర్తవుతాయి. సామాజిక ప్రభావిత అంచనా నివేదికను పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధన సంస్ధ చేపట్టనుంది. 9564 మెగావాట్ల కెపాసిటీ ఉన్న అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి 2400 ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం భూమిని అణు విద్యుత్ ప్లాంట్‌కు స్వాధీనం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వల్ల ఇప్పటికే మూడేళ్లు ఆలస్యమైందని కేంద్రం ఇటీవల రాష్ట్రానికి తేల్చి చెప్పింది.
అణు విద్యుత్ ప్లాంట్‌కు అవసరమైన రియాక్టర్లను అమెరికాకు చెందిన జిఇ హిటాచి అమర్చుతుంది. ఒక సారి భూమి స్వాధీనమైతే, నిర్వాసితులకు 12 నుంచి 18 నెలల్లో ఇండ్లను నిర్మించేందుకు న్యూక్లియార్ పవర్ కార్పోరేషన్ రంగం సిద్ధం చేసింది. ఇక్కడ భూమి మొత్తం స్వాధీనమైన తర్వాతే న్లూక్లియార్ ప్లాంట్‌కు సంబంధించి జియో టెక్నికల్ పరిశోధనలు చేపట్టడం సాధ్యమవుతుంది. 350 ఎకరాల్లోల 6వేల కుటుంబాలకు సరిపడా టౌన్‌షిప్‌ను కూడా నిర్మించనున్నారు. నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారాన్ని చెల్లిస్తారు. ఇప్పటికే 300 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని భూమిని కోల్పోతున్న రైతులకు చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నిధులను రాష్ట్రప్రభుత్వం వద్ద డిపాజిట్ చేశారు.
ఈ ప్లాంట్‌కు అవసరమయ్యే 2400 ఎకరాల్లో 1800 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయని, మిగిలిన 600 ఎకరాలు ప్రైవేట్ భూములని విజయనగరం జిల్లా కలెక్టర్ రాష్ట్రప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. పర్యావరణ అధ్యయనం పూర్తయిన తర్వాత భూసేకరణ పనులు మొదలవుతాయని న్యూక్లియార్ విద్యుత్‌ప్లాంట్ ఇంజనీర్లు చెప్పారు. పర్యావరణ నివేదిక సిద్ధమైన తర్వాత పబ్లిక్ హియరింగ్ జరుగుతుంది.