రాష్ట్రీయం

రండి.. విమానం ఎక్కండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 4: తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల్లో ప్రభుత్వ స్కూళ్లలో చదివి పదో తరగతిలో టాపర్లుగా నిలిచిన 90 మంది విద్యార్ధులకు వందేమాతరం ఫౌండేషన్ విహంగ విహారం చేసే అవకాశం కల్పించింది. గత ఎనిమిదేళ్లుగా విద్యార్ధుల్లో స్ఫూర్తిని రగిలించేందుకు, పేద విద్యార్ధులకు విమానం ఎక్కే అవకాశాన్ని కల్పించేందుకు వందేమాతరం ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. జిపిఎ 10కి 10 పాయింట్లు సాధించిన వారినే కాకుండా 9.9, 9.8 పాయింట్లు సాధించిన వారిని కూడా ఎంపిక చేశామని ఫౌండేషన్ ప్రతినిధి అనిల్ నలందా చెప్పారు. ఈ కార్యక్రమానికి ఫ్లైటెక్ సంస్థ తోడ్పాటునిస్తూ వస్తోంది. విద్యార్ధులను సోమవారం గుర్రంగూడలోని ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమికి తీసుకువెళ్లి ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకూ విడతలవారీ ఏరియల్ ట్రిప్‌కు తీసుకువెళ్తారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ రేంజ్ డిఐజి డాక్టర్ అకున్ సబర్వాల్ హాజరవుతారని అనిల్ చెప్పారు. మరుసటి రోజు రవీంద్రభారతిలో విద్యార్ధులకు సత్కార కార్యక్రమం ఏర్పాటు చేశారు.