రాష్ట్రీయం

గగనతలంలో పర్యాటకులకు విహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 4: గగనతలంలో విహరిస్తూ ప్రత్యేక అనుభూమిని పొందే అవకాశం ఇకనుంచి భక్తులు, పర్యాటకులకు కలగనుంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ ప్రత్యేక ప్యాకేజీలు నిర్వహించనుంది. కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి సన్నిధి తిరుమల నిత్యం భక్తజనంతో నిండి ఉంటుంది.దేశం నలుమూలలనుంచి తరలివచ్చే భక్తులు తిరుపతి పరిసరాలను గగనతలం నుంచి వీక్షిస్తూ వినోదాన్ని, ఆహ్లాదాన్ని పొందేందుకు వీలుగా ఈ సంస్థ ఢిల్లీ, ముంబయి ప్రాంతాలకు చెందిన ఓ కార్పొరేట్ సంస్థతో ఎంవోయు కుదుర్చుకుంది. దీనికి తిరుపతి సమీపానున్న శిల్పారామం వద్ద ఎకరా స్థలాన్ని చిత్తూరు జిల్లా యంత్రాంగం పరిశీలించింది. దీనిని అభివృద్ధిపరిచి త్వరలో ప్రయోగాత్మకంగా హెలీ టూరిజాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ నిర్ణయించింది. దేశంలోని పలు ముఖ్య పట్టణాల నుంచి తరలివచ్చే భక్తులు ముందుగా కోరుకున్న మీదట ఆరుగురితో కూడిన ప్యాకేజీని నిర్ణయిస్తుంది. ఈ విధంగా వచ్చే వారిని తిరుపతి పట్టణంలో దింపుతుంది. అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల ద్వారా కొండపైకి తీసుకువెళ్లి దర్శనం చేయిస్తుంది. తరువాత చుట్టుపక్కల ఉండే గండికోట, శ్రీకాళహస్తి ప్రముఖ పుణ్యక్షేత్రాల దర్శనం అనంతరం వారు కోరుకునే చోట దింపుతుంది. అలాగే తిరుపతి పట్టణంలో గగనతలంలోను కొద్దిసేపు విహరిస్తూ పర్యాటకులకు వినోదాన్ని, ఆహ్లాదాన్ని అందించే విధంగా మరో ప్యాకేజీని ప్రవేశపెట్టనుంది. ముందుగా కోరుకునే వారి కోసం ‘కస్టమర్ టూరిజం’ అందుబాటులోకి రానుంది. అయితే ఒక్కొక్కరు రెండు వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కేవలం తిరుపతి పట్టణంలో గగనతలంలో నిర్దేశించిన సమయంలో తిప్పి కిందకు దింపుతుంది. ఇది కాకుండా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి హెలీ టూరిజం ప్రాజెక్టును ఉపయోగించుకోవాలనుకునే వారి కోసం ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు టూరిజం సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది.
గత ఏడాది గోదావరి పుష్కరాల్లో అమలు చేసిన హెలీ టూరిజానికి భక్తుల నుంచి విశేష ఆదరణ లభించింది. దీని తరువాత జరిగిన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహోత్సవాల సమయంలోనూ హెలీ టూరిజం పేరుతో ప్రత్యేక ప్యాకేజీని ఈ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ విధంగా హెలీ టూరిజానికి తగిన విధంగా ఆదరణ లభించడం, ఆర్థిక లక్ష్యాలను సాధించగలుగుతున్నామని తిరుపతి ఏపీ టూరిజం సంస్థ డివిజనల్ మేనేజర్ సురేశ్‌కుమార్‌రెడ్డి ఆంధ్రభూమికి తెలిపారు. తాము ప్రవేశపెడుతున్న హెలీ టూరిజానికి వచ్చే ఆదరణను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌లో రాష్ట్ర రాజధాని అమరావతి, విశాఖ సముద్రతీరంలో పర్యాటకుల కోసం సరికొత్త ప్యాకేజీలను ప్రవేశపెట్టాలని ఆలోచన చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.