రాష్ట్రీయం

సింగిల్ పర్మిట్ ఇవ్వకుంటే ‘సరిహద్దు దిగ్బంధం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 4: ఈ నెల 10వ తేదీలోగా సమస్యలు పరిష్కరించకుంటే రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో రోడ్డు దిగ్బంధం చేస్తామని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ శనివారం హెచ్చరించింది. తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎన్ భాస్కర్‌రెడ్డి, జి దుర్గాప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ నిరుడు తెలంగాణ లారీ యజమానులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా సింగిల్ పర్మిట్ కావలసి ఉండగా ఆ ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం గత పక్షం రోజుల క్రితం ఉత్తరప్రత్యుత్తరాలు జరిపింది. సింగిల్ పర్మిట్ విధానంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించలేదు. కాగా గత నెల 24న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలసి సింగిల్ పర్మిట్ విధానంపై చర్చించామని తెలిపారు. అందుకు ఏపి ప్రభుత్వం అధికారులతో చర్చించి పర్మిట్ ఇచ్చేందుకు తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ పర్మిట్‌తో ప్రతి లారీకి ఏడాదికి రూ. 8వేలు వసూలు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిసిందని వారు చెప్పారు. సింగిల్ పర్మిట్ ఇచ్చిపుచ్చుకోవడంలో కొన్ని రాష్ట్రాలు ఏడాదికి రూ. 2వేలు, 3వేలు, 5వేలు వరకు వసూలు చేస్తున్నాయని అన్నారు. ఇతర రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణలో కూడా పర్మిట్ ఇస్తూ ఏడాదికి రూ. 5వేలు వసూలు చేయాలని వారు సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాలు సింగిల్ పర్మిట్ విధానాన్ని ఏడాదికి రూ. 5వేల పన్నుతో అంగీకరించి ఉత్తర్వులు జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నెల 10లోగా సింగిల్ పర్మిట్ విధానాన్ని అమలు జరుపకపోతే రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో రోడ్డు దిగ్బంధం చేస్తామని వారు హెచ్చరించారు.