రాష్ట్రీయం

టిడిపికి కేంద్రంలో మరో మంత్రి పదవి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 5: మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి కేంద్రంలో అదనంగా మరో కేంద్రమంత్రి పదవి ఇచ్చేందుకు భారతీయ జనతా పార్టీ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ విషయం తెలిసిన టిడిపి ఎంపిలు ఇప్పటినుంచే లాబీయింగ్ ప్రారంభించారు. మిత్రపక్షమైన బిజెపికి అడిగిన వెంటనే ఒక రాజ్యసభ సీటు ఇచ్చి, ఆ పార్టీ నాయకత్వాన్ని మెప్పించిన టిడిపి అధినేత, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అందుకు తగిన రాజకీయ ప్రయోజనం పొందనున్నారు. రాజకీయాల్లో ఇచ్చి పుచ్చుకునే సంప్రదాయం ఉండాలన్న సూత్రానికి అనుగుణంగా, రాజ్యసభ సీటు ఇచ్చిన టిడిపికి కేంద్రంలో అదనంగా ఒక సహాయమంత్రి పదవి ఇచ్చేందుకు బిజెపి నాయకత్వం అంగీకరించింది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. బిజెపికి ఒక రాజ్యసభ సీటు ఇచ్చినందుకు ప్రతిగా, గవర్నర్‌తోపాటు కొన్ని కేంద్ర నామినేటెడ్ పదవులు ఇవ్వాలని, బాబు బిజెపిముందు ప్రతిపాదన పెట్టారు. గతంలో అమిత్‌షా సూచన ప్రకారం, ప్రతిష్ఠాత్మక టిటిడికి పార్టీలో ఎంత పోటీ ఉన్నా, ఎంతమంది అర్హులున్నా కాదని, బిజెపికి చెందిన ఇద్దరికి స్థానం కల్పించామని బాబు గుర్తు చేశారు. అయితే, గవర్నర్ పదవిపై స్పష్టత ఇవ్వని బిజెపి, ఒక కేంద్ర సహాయ మంత్రి, మరో రెండు కేంద్ర నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. గవర్నర్ పదవి ఇస్తే కేంద్రమంత్రి పదవి ఇవ్వకపోవచ్చని, రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే ఇస్తారని బిజెపి అగ్రనేతలు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితిలో, పార్టీకి పనిచేసిన మోత్కుపల్లికి తాను హామీ ఇచ్చినందున, గవర్నర్ పదవి ఇవ్వాలని బాబు తన ఇబ్బందిని వెల్లడించారు. దానిపై కేంద్ర మంత్రివర్గ విస్తరణ సమయంలో స్పష్టత వస్తుందని టిడిపి-బిజెపి వర్గాలు భావిస్తున్నాయి.
కాగా, కేంద్రంలో అదనంగా ఒక సహాయ మంత్రి పదవి ఖాయమని తెలిసిన నేపథ్యంలో, టిడిపి ఎంపిలు ఎవరి మార్గాల్లో వారు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. ఈ విషయంలో అనూహ్యంగా తెరపైకొచ్చి రాజ్యసభ సీటు పొందిన, టిజి వెంకటేష్ అప్పుడే తీవ్ర స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన ఇప్పటికే ఈ విషయంలో లోకేష్‌ను కలిశారన్న ప్రచారం జరుగుతోంది. రాజ్యసభ సీటు సాధించేందుకు మార్గాలేమిటో తెలిసిన టిజి.. ఇప్పుడు కేంద్రమంత్రి పదవి సాధనలోనూ అదే మార్గం అనుసరించే పనిలో ఉన్నారని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వడంపై కెఈ ప్రభాకర్ సహా ఇతర వర్గాలు బహిరంగంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే.
కాపు ఉద్యమ నేపథ్యంలో ఆ వర్గానికి చెందిన ఎంపి, ప్రస్తుతం లోక్‌సభలో పార్టీ నేతగా ఉన్న తోట నరసింహం పేరు కూడా వినిపిస్తోంది. తోటకు కేంద్రమంత్రి పదవి ఇవ్వడం ద్వారా, కాపు జాతిని తన వైపు మళ్లించుకోవచ్చన్న వాదన వినిపిస్తోంది.
ఇక తెలంగాణలో అనాథలా మారిన పార్టీకి మళ్లీ ఆక్సిజన్ ఎక్కించాల్సిన అవసరం ఉందని నాయకత్వం భావిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఒక్క రేవంత్‌రెడ్డి మినహా మరెవరూ ప్రభుత్వంపై పోరాడేందుకు ముందుకు రావడం లేదు. అయితే రేవంత్‌రెడ్డి ప్రసంగాల వరకూ బాగున్నప్పటికీ, సంస్థాగతంగా, కార్యకర్తల్లో నైతిక స్థైర్యం వచ్చేలా నిర్ణయాలు తీసుకోవలసి ఉందని పార్టీ ముఖ్యలు చెబుతున్నారు.
అందులో భాగంగా, బాబుకు అత్యంత నమ్మకస్తుడు, విధేయుడయిన వరంగల్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావుకు కేంద్రమంత్రి పదవి ఇవ్వవచ్చంటున్నారు. తెలంగాణలో పార్టీకి శస్తచ్రికిత్స చేయాలంటే, ఆ ఆ ప్రాంతం నుంచి ఒకరికి కేంద్రమంత్రి పదవి ఇస్తే, మళ్లీ కార్యకర్తల్లో కదలిక, ఉత్సాహం వస్తుందని విశే్లషిస్తున్నారు.