రాష్ట్రీయం

ప్రయాణంలో పదనిసలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 6: విద్యుత్‌తో నడిచే బస్సులు త్వరలోనే రాష్ట్రంలో రోడ్డెక్కనున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విజయవాడ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో కొత్తగా నిర్మించిన ఎన్టీఆర్ పరిపాలన భవనాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 80 కొత్త బస్సులను ఆయన ప్రారంభించారు. ఇందులో ప్రతి సీటు వెనక ఒక టివి ఉంటుం ది. అందులో ప్రయాణికులు తమ ఇష్టం వచ్చిన ఛానల్‌ను చూసుకునే సౌకర్యం కల్పించారు. ఈ బస్సుల్లో జిపిఎస్ కూడా ఏర్పాటు చేశారు. ఫలానా బస్ ఎక్కడ ఉందన్న విషయాన్ని ప్రయాణికుడు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కావల్సిన యాప్‌ను కూడా ఈసందర్భంగా చంద్రబాబు ఆవిష్కరించారు. బస్సు ప్రమాదానికి గురైనా, బస్సులో ప్రయాణికులు ఇబ్బందికి గురైనా వెంటనే కేంద్ర కార్యాలయానికి సమాచారం తెలిసే టెక్నాలజీని కూడా ఇక్కడ వినియోగిస్తున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఏర్పాటు చేసిన వై స్క్రీన్స్ మల్టీప్లెక్స్ థియేటర్‌ను కూడా చంద్రబాబు ప్రారంభించారు. స్వయంగా టిక్కెట్ కొని కాసేపు సినిమా కూడా చూశారు. తరువాత చంద్రబాబు నాయుడు విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్టీసీలో టెక్నాలజీ, బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకొచ్చామన్నారు. బస్‌లో జిపిఎస్ ఉపయోగించడం వల్ల బస్సు నిర్ణీత సమయానికి నడిచే అవకాశం ఉందని చంద్రబాబు అన్నారు. ఆర్టీసీ బస్‌స్టేషన్‌ను ఎయిర్‌పోర్టుల మాదిరి బస్‌పోర్టుగా తయారు చేశారని ఆయనన్నారు.

చిత్రం కొత్త టెక్నాలజీతో వచ్చిన బస్సును ప్రారంభించి పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు