రాష్ట్రీయం

జిల్లాకో లెక్కుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 6: కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. రెండు రెవిన్యూ డివిజన్లు, 20 మండలాలకు ఒకటి చొప్పున కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రామాణికంగా తీసుకోవడంతోపాటు జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్లకు మించకుండా విస్తీర్ణం ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ప్రస్తుతం ఉన్న 119 శాసనసభ నియోజకవర్గాల సంఖ్య భవిష్యత్‌లో 153 నియోజకవర్గాలకు పెరుగనున్న దృష్ట్యా వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని కొత్త జిల్లాల ప్రతిపాదనలు తయారు చేయాలని ఇప్పటికే భూ పరిపాలన కమిషనర్‌కు ముఖ్యమంత్రి సూచనలు చేశారు. ప్రతిపాదనలపై ముసాయిదా రూపకల్పనకు కలెక్టర్లకు మార్గనిర్దేశం చేయడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన మంగళ, బుధవారాల్లో ఉన్నతస్థాయి సమావేశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెండు రోజులపాటు మర్రి చెన్నారెడ్డి మానవ కేంద్రంలో జరగనున్న ఈ సమావేశానికి కలెక్టర్లతోపాటు మంత్రులు, రెవిన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, భూ పరిపాలన కమిషనర్ తదితర ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆహ్వానించింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు మార్గదర్శకాలతోపాటు ఈ కీలక సమావేశంలో ఏయే జిల్లాలను విభజించి, కొత్త జిల్లాలను ఏర్పాటుచేయబోతున్నారో ఖరారు చేయనున్నట్టు సమాచారం. క్షేత్రస్థాయిలో
కలెక్టర్ల నుంచి ప్రాథమికంగా అందిన ప్రతిపాదనల మేరకు మొత్తంగా 24 జిల్లాల ఏర్పాటుకు సిఫారసు అందినట్టు తెలిసింది. ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్ జిల్లాలను రెండేసి జిల్లాలుగా (8 జిల్లాలు) మెదక్, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాలను మూడేసి జిల్లాలుగా (9 జిల్లాలు), హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిని (5 జిల్లాలుగా) విభజించి, రంగారెడ్డి జిల్లా కేంద్రాన్ని వికారాబాద్‌కు మార్చడంతోపాటు నిజామాబాద్ జిల్లాలోని నియోజకవర్గాలను మెదక్ జిల్లాలో కలపడంతో మిగిలిన ప్రాంతాన్ని నిజామాబాద్ జిల్లాగా కొనసాగించాలని ప్రతిపాదనలు అందినట్టు తెలిసింది.
ప్రతిపాదిత కొత్త జిల్లాలు ఇవే
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, జనగామ, భూపాలపల్లి, హైదరాబాద్ సెంట్రల్, చార్మినార్, గోల్కొండ, హైదరాబాద్ ఈస్ట్, సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, ఆదిలాబాద్, మంచిర్యాల, ఖమ్మం, భద్రాచలం, రంగారెడ్డి.