రాష్ట్రీయం

పారిశ్రామికవేత్తలుగా గిరిజన మహిళలకు శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 6: గిరిజన మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చి దిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్టు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ తెలిపారు. ఔత్సాహిక గిరిజన పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (యున్‌డిపి)తో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. సచివాలయంలో సోమవారం గిరిజనాభివృద్ధి అధికారులు, యుఎన్‌డిపి అధికారుల మధ్య ఒప్పందం కుదిరి, పరస్పరం ఒప్పంద పత్రాలను అందజేసుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా భద్రాచలం, ఎటూరు నాగారం, ఉట్నూరు, హైదరాబాద్ కేంద్రాల్లో నెల రోజుల్లో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల అభివృద్ధి కేంద్రాలను ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఈ కేంద్రాల ద్వారా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు పెట్టుబడి, సాంకేతికత, యాజమాన్య పద్దతి, వౌలిక సదుపాయాల కల్పనలో సహకారాన్ని అందించనున్నట్టు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1000 మంది గిరిజన మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దనున్నట్టు చందూలాల్ తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న స్వయం ఉపాధి పథకాలపై గిరిజనులకు అవగాహన కల్పించడంతో పాటు నైపుణ్య శిక్షణ కూడా ఈ కేంద్రాల ద్వారా అందజేయనున్నట్టు చందూలాల్ తెలిపారు.
75కోట్ల రూపాయల వ్యయంతో 26 గిరిజన భవనాలను నిర్మించనున్నట్టు చందూలాల్ తెలిపారు. సచివాలయంలో సోమవారం సచివాలయంలో గిరిజన సబ్ ప్లాన్ నోడల్ ఏజెన్సీ సమావేశం నిర్వహించారు. గిరిజన యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం కోసం 36కోట్లతో తొమ్మిది యువజన శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.పది కోట్ల వ్యయంతో 50 పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్, పది వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్‌ను 27.5కోట్లతో ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.