రాష్ట్రీయం

కొండ నాలుకకు మందేస్తే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 6: రాష్ట్రంలో భూ రికార్డుల ఆధునికీకరణ వ్యవహరం ‘కొండ నాలుకకు మందేస్తే’ అన్న చందంగా మారిపోయింది. రాష్టవ్య్రాప్తంగా ఉన్న అన్ని రకాల భూ రికార్డుల వెబ్‌ల్యాండ్ తయారీకి ప్రభుత్వం చర్యలు తీసుకున్న నేపథ్యంలో దశాబ్దాల నాటి సర్వే నెంబర్లు మారిపోయి, రిజిస్ట్రేషన్ల సమయంలో తలనొప్పులు మొదలయ్యాయి. రాష్ట్రంలో 2012-13లోనే భూ రికార్డులు కంప్యూటరీకరించారు. అయితే అప్పట్లో ఎటువంటి సమస్యలు తలెత్తలేదు. తాజాగా వెబ్‌ల్యాండ్ పేరుతో సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానం చేసిన తర్వాత భూ రికార్డులు తీవ్ర గందరగోళంగా మారాయి. వివరాలన్నీ తప్పుల తడకగా మారాయి. వెబ్‌ల్యాండు సాఫ్ట్‌వేర్ ద్వారా ల్యాండు రికార్డుల్లో రైతుల పేర్లను ఆటోమేటిక్ సబ్ డివిజన్లు ఇవ్వడం ద్వారా డిజిటల్ సైన్ చేయడంతో సంబంధంలేని సబ్ డివిజన్లపై మళ్లీ సబ్ డివిజన్లు ఏర్పడి తప్పుల తడకగా మారిపోయాయి.
గ్రామ రికార్డు, అడంగల్, ఆర్‌ఎస్‌ఆర్, ఎఫ్‌ఎంబి, ఎ రికార్డులు, దస్తావేజులు, పాస్ బుక్‌ల్లో ఒక సర్వే నెంబరు ఉంటే వెబ్‌ల్యాండ్‌లో మరో సబ్ డివిజన్ నెంబరు కనిపిస్తోంది. ఆన్‌లైన్లో సబ్ డివిజన్ సర్వే నెంబరుకు, రికార్డులో ఉన్న నెంబరుకు అసలు పొంతనే ఉండడంలేదు. దీంతో కంప్యూటర్ ద్వారా కొత్త సబ్ డివిజన్ల నెంబర్లను జనరేట్ చేస్తున్నారు. సంబంధంలేని సబ్ డివిజన్ రావడం వల్ల రిజిస్ట్రేషన్ శాఖకు ఏ సర్వే నెంబర్‌తో రిజిస్ట్రేషన్ చేయాలో అర్ధకాని పరిస్థితి తలెత్తుతోంది. దస్తావేజుల్లో నెంబర్లకు, కంప్యూటర్ వెబ్‌ల్యాండ్ ఇచ్చే నెంబర్లకు తేడా ఉండడం వల్ల దస్తావేజు సవరణ చేయాలని, దీనికి సర్వేచేస్తేగాని సర్వే నెంబర్లు సరిగా తెలీదని రిజిస్ట్రేషన్ శాఖ చేతులు దులిపేసుకుంటోంది. దీనితో రెవెన్యూ శాఖలో సమస్యలు పేరుకుపోతున్నాయి. ఎక్కడైనా ఆధునికీకరణ జరిగితే రికార్డులన్నీ సులభతరమవుతాయి. కానీ వెబ్‌ల్యాండు సాఫ్ట్‌వేర్ వల్ల మొత్తం భూములే చిక్కుల్లోపడ్డాయి. పాత రికార్డే నాశనమైపోయే ప్రమాదకర పరిస్థితి దాపురించింది. ఈ సర్వే నెంబర్ల సమస్యలు ఉత్పన్నం కావడం వల్ల ప్రతి రైతుకు సర్వేకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంవల్ల అనేక జిల్లాల్లో దరఖాస్తులు కుప్పలుతెప్పలుగా పేరుకుపోయాయి. ప్రస్తుతం కంప్యూటర్ల ద్వారా ఇచ్చే సబ్ డివిజన్లవల్ల రానున్న రెండు మూడేళ్లల్లో భూ వివాదాలు తామరతంపరగా తలెత్తే ప్రమాదం పొంచివుంది. 1923లో తయారుజేసిన సర్వే రికార్డులు, ఎఫ్‌ఎంబి, ఎ రిజిష్టర్, విలేజ్ మ్యాప్ ఎప్పటికీ శాశ్వతంగా నిలుస్తాయి. వాటిని యథాతథగా కాపాడుకుని ఫీల్ట్ మెజర్‌మెంట్ బుక్‌లో సబ్ డివిజన్లు చేసుకుని, వాటిని మ్యూటేషన్ ద్వారా సరిచూసుకుంటే ఎప్పటికీ సమస్యలు రావని చెబుతున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో స్పందించి, నిర్ణయం తీసుకుంటే మినహా ఈ సమస్య పరిష్కారం కాదని సర్వేశాఖ అధికార్లు చెబుతున్నారు.