రాష్ట్రీయం

భావ స్వేచ్ఛకు మతోన్మాద ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 6: దేశ సమైక్యత భావస్వేచ్ఛకు మతోన్మాదం వల్ల ముప్పు వాటిల్లే ప్రమాదముందని, దీన్నుంచి దేశాన్ని కాపాడుకోవాలని మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. మతోన్మాదుల ఆట కట్టించేదుకు ప్రగతిశీల దేశంగా భారత్‌ను పరిరక్షించుకోవాలన్నారు. సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సిఆర్ ఫౌండేషన్ అధ్వర్యంలో చండ్ర రాజేశ్వరరావు102 జయంతి సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జైపాల్ రెడ్డి మాట్లాడుతూ దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ మతోన్మాదం వల్ల మరింత ప్రమాదంలో పడిందన్నారు. చండ్ర రాజేశ్వరరావు స్ఫూర్తితో దేశ రక్షణకు వామపక్ష ప్రగతిశీల శక్తులు పాటుపడాలని కోరారు. చండ్ర రాజేశ్వరరావు లాంటి యోధుల గురించి మాట్లాడటం గౌరవంగా భావిస్తున్నానని, చండ్రలాంటి వారు మన దేశంలో పుట్టడం మన అదృష్టమన్నారు. ప్రకాశం పంతులు, సుందరయ్య లాంటి వాళ్ల సరసన నిలబడగల గొప్ప వ్యక్తి చండ్ర అని పేర్కొన్న జైపాల్ రెడ్డి అయన చరిత్ర తెలియనివారు ఉండరని గుర్తు చేశారు. జాతీయవాదం కొత్తగా వచ్చిన పదమని, ఆర్‌ఎస్‌ఎస్ లాంటి సంస్థలకు చరిత్ర చెప్పడం కష్టమని, మోడీ లాంటి వ్యక్తులకు చెప్పడం ఇంకా కష్టమని అన్నారు. మతాన్ని, జాతిని, గొప్పగా ఎంచుకుని పనిచేస్తున్నవారంతా హిట్లర్ వంశీయులేనని విమర్శించారు. భావసమైక్యతకు బిజెపి వల్ల ప్రమాదం పొంచివుందని, ఉన్మాదం పెరిగితే దేశ భద్రతకే ముప్పన్నారు. మానవహక్కుల పరిరక్షణకు ప్రగతిశీల శక్తులు పనిచేయాలని,ప్రజాస్వామ్యం పునాదిగా మానవహక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని,బిజెపి చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని అన్నారు.

చిత్రం సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సిఆర్ ఫౌండేషన్ అధ్వర్యంలో చండ్ర రాజేశ్వరరావు102వ జయంతి సందర్భంగా జరిగిన సభలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి, సిపిఐ నేత నారాయణ తదితరులు