రాష్ట్రీయం

ముందే రిటైర్ చేశారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 6: మహానగర పాలక సంస్థలో పరిపాలన రోజురోజుకు గాడితప్పుతోంది. ఎవరుపడితే వారు ఆయా రాం.. గయా రాం అన్నట్టు తయారైంది పరిస్థితి. రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్‌సోర్సు ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగులు, కార్మికుల జీతభత్యాలు మొదలుకుని ఇతర ప్రయోజనాలు, పదవీ విరమణ వంటి కీలకమైన అంశాలను చూసుకునే పరిపాలన విభాగం ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ రెగ్యులర్ ఉద్యోగి పదవీ విరమణ పొందాల్సిన తేదీ కన్నా ముందే రిటైర్ అయ్యారు. నెల నెలా రావల్సిన జీతం రాకపోవటంతో ఆందోళనకు గురైన స్వీపర్ రాములమ్మ సర్కిల్, జోనల్, ప్రధాన కార్యాలయాల చుట్టు తిరిగితే గానీ అసలు విషయం బయటపడలేదు. సర్కిల్ 10లో రెగ్యులర్ స్వీపర్‌గా పనిచేస్తున్న ఎన్.రాములమ్మ సర్వీసు రికార్డుల్లో జన్మదినం 1959 ఫిబ్రవరి 2గా పొందుపరచి ఉంది. ఇదే సమాచారం జిహెచ్‌ఎంసి కంప్యూటర్లలో 1958గా తప్పుగా నమోదు చేశారు. ఈ రెండో సమాచారం ప్రాతిపదికన లెక్కచేస్తే రాములమ్మ 2019 జనవరి 31న పదవీ విరమణ పొందనుంది. అయితే ఏ పనిచేసినా, కాస్త అత్యుత్సాహాన్ని కనబరిచే అధికారులు రాములమ్మను గత జనవరి నెలాఖరులోనే ఉద్యోగం నుంచి రిటైర్ చేశారు. ఈ విషయం కూడా అధికారులు రాములమ్మకు తెలియజేయలేదు. ఆ తర్వాత ఆమెకు జీతం ఆగిపోయింది.
ఆందోళన చెందిన ఆమె ఏమైందన్న విషయాన్ని తెల్సుకునేందుకు సర్కిల్, జోనల్ కార్యాలయాల చుట్టూ ప్రదిక్షణలు చేసింది. అయితే ప్రధాన కార్యాలయం అధికారులు ఆమె సర్వీసు రికార్డులను పరిశీలించే సరికి ఆమె జన్మదినం ఫిబ్రవరి 8 1959గా ఉన్నట్లు గుర్తించారు. ఇదే సమాచారం కంప్యూటర్లలో సంవత్సరం 1958గా ఉండటాన్ని బట్టి ఆమెకు ఇంకా కనీసం సంవత్సర కాలం పదవీ కాలం ఉంది. అయినా అధికారులు ఆమెను ముందుగానే ఉద్యోగం నుంచి రిటైర్ చేసినట్లు గుర్తించిన అధికారులు తమ తప్పును తెల్సుకుని నాలుక్కర్చుకున్నారు. ఫిబ్రవరి మాసం నుంచి తాను విధులకు హాజరవుతున్నా, అప్పటి నుంచి జీతం రావటం లేదని రాములమ్మ వాపోయింది.

చిత్రం స్వీపర్‌ రాములమ్మ