ఆంధ్రప్రదేశ్‌

లక్ష్య సాధనకు మహా సంకల్పం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 7: చంద్రబాబు నాయుడు అధికార పగ్గాలు చేపట్టి సరిగ్గా నేటికి రెండేళ్లు. సమస్యలు, సవాళ్లు చంద్రబాబుకు స్వాగతం పలికాయి. విభజన నేపథ్యంలో కట్టుబట్టలతో బయటపడ్డ ఆంధ్రప్రదేశ్‌ను ఒక గాడిలో పెట్టేందుకు ముళ్ల కిరీటాన్ని తలకెత్తుకున్నారు చంద్రబాబు. భారీ ఆర్థిక లోటుతో ప్రభుత్వ కార్యకలాపాలను ఆయన ప్రారంభించాల్సి వచ్చింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు పలు చర్యలు తీసుకున్నారు. రైతుల, డ్వాక్రా మహిళల రుణ మాఫీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంపు ఫైళ్ళపై సంతకాలు చేసిన సంచలనం సృష్టించారు. ఆర్థిక లోటును పూడ్చడానికి కేంద్రం సహకరించకపోయినా ఆ ఇబ్బంది బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా ఉపయోగించుకున్నారు. రెండేళ్లలో ఇచ్చిన హామీలో కొన్నింటిని మాత్రమే తీర్చగలిగారు. దీనివలన కొన్ని వర్గాల్లో చంద్రబాబు పట్ల గౌరవం పెరిగినా, అనేక సమస్యలను పరిష్కరించలేకపోవడంతో కొన్ని వర్గాల్లో అసంతృప్తి మిగిలింది. కేంద్రంతో సఖ్యత కొనసాగిస్తున్నా, ఆశించినంతగా కేంద్రం స్నేహ హస్తాన్న అందించకపోవడంతో ఇరు ప్రభుత్వాలపట్ల ప్రజల్లో కొంత విశ్వసనీయత తగ్గింది. ఈ రెండేళ్ల పాలనలో తను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, విభజన వలన వచ్చిన నష్టాలు, వాటిని ఏవిధంగా అధిగమిస్తున్నామన్న అంశాలను కడపలో బుధవారం జరగనున్న మహా సంకల్ప దీక్షలో ప్రజలకు వివరించనున్నారు. కడపలో బుధవారం సాయంత్రం జరిగే సభలో రెండేళ్ల పాలనపై పూర్తి స్థాయి నివేదికను ఇవ్వనున్నారు. అలాగే భవిష్యత్ లక్ష్యాలను కూడా ప్రజలకు తెలియచేనున్నారు. సాధారణ పాలన, ఆర్థిక శాఖ, రెవెన్యూ, సివిల్ సప్లైస్ వంటి ముఖ్య శాఖలపై ఆయన మంగళవారం రాత్రి బాగా పొద్దుపోయే వరకూ సమీక్షలు జరిపారు. ఈ శాఖలు వచ్చే ఏడాదిలో సాధించాల్సిన లక్ష్యాలను మహా సంకల్ప దీక్షలో ప్రకటించనున్నారు. అలాగే రాజధాని అమరావతిని ఏవిధంగా పూర్తి చేయనున్నారన్న విషయాన్ని కూడా ప్రజలకు వివరించనున్నారు. 2019 ఎన్నికల లక్ష్యంగా కొన్ని కొత్త పథకాలను కూడా చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించే అవకాశం ఉంది. గత ఏడాది మహా సంకల్ప దీక్షను చంద్రబాబు గుంటూరులో నిర్వహించారు. కానీ ఈ సంవత్సరం కడపతోపాటు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ దీక్షా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలతో ప్రతిజ్ఞ కూడా చేయించనున్నారు.

జగన్ ఇలాకాలో బాబు దీక్ష
జగన్ ఇలాకా అయిన కడపలో చంద్రబాబు నాయుడు మహా సంకల్ప దీక్ష చేపట్టడం రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. గత కొద్ది రోజులుగా జగన్, చంద్రబాబు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తొలుత మహా సంకల్ప దీక్షను ఒంగోలులో నిర్వహించాలనుకున్న చంద్రబాబు, జగన్ ఎప్పుడైతే చంద్రబాబుపై విమర్శనాస్త్రాలను సంధించడం మొదలుపెట్టారో సంకల్ప దీక్షను కడపకు మార్చుకున్నారు. జగన్‌కు తగిన జవాబు ఇవ్వడానికే చంద్రబాబు అక్కడ సభ నిర్వహిస్తున్నారని రాజకీయ వర్గాలు విశే్లషిస్తున్నాయి. బుధవారం నాటి సభ తరువాత రాజకీయ పరిణామాలు ఏవిధంగా ఉంటాయోనని రాజకీయ పరిశీలకులు అంచనాలు వేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా బుధవారం నాటి సభకు 4000 మంది పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 40 సిసి కెమేరాలను కూడా వినియోగిస్తున్నారు.