ఆంధ్రప్రదేశ్‌

అరెస్ట్‌లు ఆగవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 7: తూర్పు గోదావరి జిల్లా తునిలో రైలు దగ్ధం కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఆరుగురిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారని, ఘటనకు బాధ్యులైన మరికొందరిని కూడా అరెస్ట్ చేయనున్నట్లు హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. మంగళవారం గుంటూరులో మీడియాతో ఆయన మాట్లాడుతూ అమాయకులపై ఎలాంటి వేధింపులకు ప్రభుత్వం తావివ్వదని, ఘటన వెనుక రౌడీషీటర్ల ప్రమేయం ఉన్నట్లు తేలిందన్నారు. వీరిలో అధికశాతం మంది వైకాపా కార్యకర్తలేనని తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్తూ కొంతమంది రాజకీయ స్వప్రయోజనాల కోసం కులాన్ని రెచ్చగొడుతున్నారని విమర్శించారు. శాంతి భద్రతల పర్యవేక్షణ అనేది ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమనేది గ్రహించాలన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తే ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు ఉండవని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఉన్మాదంతో వ్యవహరిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.

జూనియర్ ఆర్టిస్టు
కిడ్నాప్ కేసులో పురోగతి
ఇద్దరి అరెస్టు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 7: నగరంలో కలకలం రేపిన జూనియర్ ఆర్టిస్టు కిడ్నాప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మంగళవారం ఇద్దరిని అరెస్టు చేసి మరో ముగ్గురి కోసం గాలిస్తున్నట్టు జూబ్లిహిల్స్ సిఐ వెంకటరెడ్డి తెలిపారు. కృష్ణానగర్‌లో నివాసముంటున్న జూనియర్ ఆర్టిస్టు శ్రీనివాసరావు (48)ను గతనెల 31వ తేదీన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. రూ. 2లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతోపాటు డబ్బులివ్వకుంటే హతమార్చుతామని కూడా భయపెట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మహమ్మద్ జలీల్, గణేశ్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ముగ్గురిని గాలిస్తున్నట్టు ఇన్‌స్పెక్టర్ వెంకటరెడ్డి తెలిపారు.

మమ్మల్ని ఆదుకోండి!
నక్సల్స్ బాధిత కుటుంబాల వినతి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 7: గ్రామాల్లో సాధారణ జనాన్ని నక్సలైట్లు హత్య చేస్తే, ఆ బాధిత కుటుంబాలను ఆదుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందా? లేదా? ఆదిలాబాద్ జిల్లాలోని వేర్వేరు గ్రామాలకు చెందిన ముగ్గురు యువకులు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్‌పి చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో నేరుగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును కలిసేందుకు హైదరాబాద్ వచ్చామని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా తిర్యాణి మండలం లొద్దిగూడా గ్రామానికి చెందిన ఆర్. నాను (ఎస్‌టి), ఖానాపూర్ మండలంలోని పెంబి గ్రామానికి చెందిన ఎ. చిన్నాగౌడ్, నేనెల్ల మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన కె. సతీష్‌కుమార్‌లను రెండు దశాబ్దాల క్రితం పోలీస్ ఇన్‌ఫార్మర్లపేరుతో నక్సలైట్లు హత్య చేశారు. గతంలో నక్సలైట్ల చేతుల్లో ఎవరైనా మరణిస్తే, 504 జీవో ప్రకారం వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేవారు. వ్యవసాయం చేసుకునే వారికి భూములను ఇచ్చేవారు. నాను, చిన్నాగౌడ్, మల్లాగౌడ్‌లు హత్యకు గురైన సమయానికి వారి పిల్లలు మైనర్లుగా ఉండటంతో వారికి ప్రభుత్వ ఉద్యోగం లభించలేదు. మైనర్ పిల్లలు కాస్తా మేజర్లుగా మారడంతో ఇప్పుడు తమను ఆదుకోవాలని మృతుల కుమారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నాను కుమారుడు ఆర్. జైపాల్ (ఎస్‌టి), చిన్నాగౌడ్ కుమారుడు ఎ. సుధీర్‌గౌడ్ (బిసి-బి), మల్లాగౌడ్ కుమారుడు కె. సతీష్ కుమార్ (బిసి-బి) కలిసి మంగళవారం రాష్ట్ర మంత్రి జోగురామన్నను కలిశారు. తమకు న్యాయం చేస్తానని మంత్రి హామీ ఇచ్చినట్టు జైపాల్ తదితరులు ఆంధ్రభూమి ప్రతినిధితో చెప్పారు.