ఆంధ్రప్రదేశ్‌

ఆమరణ దీక్షకు ముద్రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి నుంచి ప్రారంభం కిర్లంపూడిని దిగ్బంధించిన సాయుధ బలగాలు నేతల గృహ నిర్బంధానికీ రంగం సిద్ధం
మద్దతుగా ఎక్కడికక్కడే దీక్షలు అరెస్టు చేస్తే జైలులోనే దీక్ష తప్పదన్న కాపునేత అరెస్ట్ జరగవచ్చన్న చినరాజప్ప

కాకినాడ, జూన్ 8: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన స్వగృహంలో గురువారం ఉదయం 9 గంటల నుండి ఆమరణ దీక్షకు దిగనున్నారు. తన డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించక పోవడంతో ఇక దీక్షే శరణ్యమని ఆయన నిర్ణయించుకున్నారు. ముద్రగడ దీక్ష తప్పదన్న నిర్ణయానికి వచ్చిన పోలీసు బలగాలు కిర్లంపూడి పరిసరాలను జల్లెడ పట్టాయి. భారీ ఎత్తున సాయుధ బలగాలను ఈ ప్రాంతంలో మోహరింపజేశారు. కిర్లంపూడి గ్రామానికి ఇతర ప్రాంతాల నుండి వచ్చే వాహనాలను బుధవారం నుండే నిలిపివేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సాయుధ దళాలను ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన కాపు నేతలు దీక్షా స్థలికి వెళ్లకుండా హౌస్ అరెస్టులు చేయాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. దీంతో ముఖ్య నేతలు ఎక్కడికక్కడే ముద్రగడకు మద్దతుగా దీక్షలు ప్రారంభించే యోచనలో ఉన్నట్టు సమాచారం అందింది. ముద్రగడ దీక్షకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయనను ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉన్నదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేయడం గమనార్హం! ఇదే విషయాన్ని ముద్రగడ దృష్టికి విలేఖరులు తీసుకువెళ్లగా తనను అరెస్ట్ చేస్తే జైలులో కూడా నిరాహార దీక్షను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. తనతో సంప్రదింపులు జరిపేందుకు ఏ ఒక్క ప్రజాప్రతినిధి గాని, మంత్రులు గాని రావద్దని సూచించారు. చంద్రబాబు తీసుకుంటున్న అనుచిత నిర్ణయాల కారణంగా కాపుల్లో ఐక్యత పెరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. తుని దుర్ఘటనలో సిఐడి అరెస్టులను నిరసిస్తూ తక్షణం కేసులు ఉపసంహరించుకోవాలని, రిమాండ్‌లో ఉన్నవారిని బుధవారం సాయంత్రం 6 గంటల్లోగా విడుదల చేయని పక్షంలో ఈనెల 9వ తేదీ ఉదయం 9 గంటల నుండి నిరాహార దీక్ష చేపడతానని ముద్రగడ హెచ్చరించిన విషయం తెలిసిందే! ఐతే ప్రభుత్వం నుండి ఏ విధమైన స్పందన లేకపోవడంతో ముద్రగడ వర్గీయుల్లో అలజడి మొదలయ్యింది. పోలీసులు కూడా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. గతంలో జరిగిన పొరపాట్లకు తావులేకుండా పటిష్టమైన రీతిలో బందోబస్తు చర్యలు చేపట్టారు. ముద్రగడ ఇలా దీక్షకు సంబంధించిన ప్రకటన చేశారో, లేదో అలా సాయుధ దళాలను మోహరించారు. అవసరమైతే ముద్రగడను అరెస్టు చేస్తామని చినరాజప్ప ప్రకటించడంతో ముద్రగడ వర్గీయుల్లో దుమారం రేగుతోంది. ముద్రగడ ఎవరికీ అంతుచిక్కని విధంగా దీక్షా వ్యూహం రూపొందించుకున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసుల కను సన్నల్లో కిర్లంపూడి పరిసర ప్రాంతాలుండగా, బుధవారం నుండి మీడియా వాహనాలను కూడా గ్రామంలోకి అనుమతించకపోవడం విశేషం!
కిర్లంపూడికి పోటెత్తిన కాపు నేతలు...
దీక్ష నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన కాపునేతలు ముద్రగడను కలసి సంఘీభావం తెలిపారు. విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పలు ప్రాంతాలకు చెందిన కాపు నేతలు, కార్యకర్తలు కిర్లంపూడి వచ్చి ముద్రగడతో సమావేశమయ్యారు. అయితే బుధవారం సాయంత్రం నుండి అన్ని రాకపోకలపై నిషేధం విధించారు. దీంతో నేతలు ఆయా ప్రాంతాల్లో ఎక్కడికక్కడే దీక్షలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.
chitram...
ముద్రగడ పద్మనాభంను కలిసిన గిరజాల స్వామినాయుడు, పెండెం దొరబాబు, కాపునాయకులు, కిర్లంపూడికి చేరిన పోలీసు బలగాలు