ఆంధ్రప్రదేశ్‌

చట్టాన్ని ధిక్కరిస్తే చర్యలు తప్పవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, జూన్ 8:చట్టాన్ని ధిక్కరించినవారిపై చర్యలు తప్పవని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హెచ్చరించారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం క్యాంపు కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముద్రగడ తీరుపై చినరాజప్ప నిప్పులు చెరిగారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తున్నారని, ఇతర బీసీలకు నష్టం లేకుండా చట్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందోని ఆయన అన్నారు. కాపులు, కాపు యువత అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. రిజర్వేషన్లపై మంజునాథ్ కమిషన్, కాపు కార్పొరేషన్‌కు వెయ్యి కోట్లు కేటాయించామన్నారు. రెండు వందల కోట్లు రుణాలుగా అందించామన్నారు. కాపుయువతను తప్పుదారి పట్టించి, వారి జీవితాలను నాశనం చేసేందుకు ముద్రగడ కంకణం కట్టుకున్నారని రాజప్ప ఆరోపించారు. కాపు యువత ఎవరూ ముద్రగడ మాయలో పడొద్దని హితవు పలికారు. యువతపై కేసులు నమోదైతే వచ్చే ఇబ్బందులను రాజప్ప గుర్తుచేశారు. ముద్రగడ 30 ఏళ్లపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ పదవులు నిర్వహించారని, అనాడు ఎందుకు రిజర్వేషన్లపై పోరాటం చేయలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం కాపు ప్రతినిధులను ప్రభుత్వానికి చెక్క్భజన చేస్తున్నారని ఆరోపిస్తున్న ముద్రగడ 30 ఏళ్ల పాలనా కాలంలో రిజర్వేషన్లపై నోరు మెదపకుండా ఆయన చేసిందికూడా చెక్క్భజనేనా అని ఎద్దేవా చేసారు. తుని అల్లర్లతో సంబంధం ఉన్నవారిపైనే కేసులు నమోదయ్యాయని, అమాయకులపై కాదన్నారు. కేసుల్లో సంబంధం ఉన్నవారిని అరెస్టులు చేసి వారిని కోర్డులో కూడా హాజరుపర్చారన్నారు. ఈ సంఘటనతో సంబంధం లేనివారెవరైనా ఉంటే వారిపై కేసులను ఉపసంహరిస్తామే తప్ప, ఘటనకు కారకులైనవారిని ఉపేక్షించేది లేదని రాజప్ప స్పష్టం చేశారు. ప్రస్తుతం అరెస్టు అయినవారిలో కాపులతో పాటు బిసిలు, ఎస్సీలు ఉన్నారని, వారంతా రౌడీ షీటర్లు, వైసిపి నాయకులు, కార్యకర్తలేనన్నారు. రౌడీలు, గూండాలను వెనుకేసుకొస్తున్న ముద్రగడ వ్యవహార శైలిని ప్రతీ ఒక్కరూ గమనిస్తున్నారన్నారు. తుని బహిరంగ సభ సందర్భంగా రైళ్లను అడ్డుకోమని ముద్రగడ చెప్పిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కాని ముద్రగడ అక్కడ విధ్వంసాన్ని నివారించలేకపోయారన్నారు.

ముద్రగడవి బ్లాక్‌మెయల్
రాజకీయాలు: నారాయణ
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, జూన్ 8: కాపు రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధితో ప్రభుత్వం పనిచేస్తుంటే ముద్రగడ పద్మనాభం మరోసారి దీక్ష పేరుతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ధ్వజమెత్తారు. బుధవారం రాత్రి గుంటూరులో తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ జగన్ అనే అరాచక శక్తికి ముద్రగడ ఆయుధంగా మారుతున్నారని, ఏ క్షణంలో ఏం మాట్లాడతారో, ఏం చేస్తారో ఆయనకే తెలియని పరిస్థితి నెలకొందన్నారు. తుని అల్లర్ల కేసులో దోషులను శిక్షించాలని ఆయనే సూచించి అరెస్ట్ చేస్తుంటే కేసులు మాఫీ చేయాలని, అక్రమమని వ్యాఖ్యానించడం విడ్డూరమన్నారు. మతి భ్రమించిన ముద్రగడ చంద్రబాబుపై ఆరోపణలు చేయడం తగదన్నారు. తుని ఘటనకు కారణం చంద్రబాబా, ముద్రగడా అని ప్రశ్నించారు. సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది, రైల్‌రోకోను ప్రేరేపించింది, రైలు దగ్ధం చేసి ప్రయాణిలకును భయభ్రాంతులకు గురిచేసింది చంద్రబాబు నాయకత్వంలో జరిగిందో, ముద్రగడ నేతృత్వంలో జరిగిందో ప్రజలకు తెలుసన్నారు. ముద్రగడ కాపులను బజారుకీడ్చి పరువు తీస్తున్నారని, కాపుల సంక్షేమాన్ని విస్మరించి విధ్వంసం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. తుని ఘటన వెనుక అరాచక శక్తులున్నాయని, కాపులు అమాయకులని మొదట్నుంచి చంద్రబాబు చెబుతున్నారని గుర్తుచేశారు. అరెస్ట్‌చేసిన వారిని విడిపించేందుకు దీక్ష డ్రామా మొదలెట్టారని ధ్వజమెత్తారు. ముద్రగడ ప్రమేయం బయట పడుతుందనే భయంతోనే ఈ రకమైన కుతంత్రాలు పన్నుతున్నారని విమర్శించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనే చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి సహకరించాలని హితవు పలికారు.