రాష్ట్రీయం

సాగునీటి సంఘాలపై నివేదిక ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 8: ఆంధ్ర రాష్ట్రంలో ఉత్తమ పద్ధతుల్లో సాగునీటి సంఘాలను నిర్వహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, కర్నాటక, ఒడిశాలో ప్రతి వంద హెక్టార్లకు ఒక సాగునీటి సంఘం ఉందని, అదే ఆంధ్రాలో 1600 హెక్టార్లకు ఒక సాగునీటి సంఘం ఉందని ఏపి ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. వైకాపాకు చెందిన ఎమ్మెల్యే కోన రఘుపతి సాగునీటి సంఘాలకు రాష్ట్రప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడంపై హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ఏపి ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కృష్ణ ప్రకాశ్ వాదనలు వినిపిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తమ పద్ధతుల్లో సాగునీటి సంఘాలను నిర్వహించేందుకు జీవో 198 ద్వారా కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఈ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించేందుకు 25 నెలలు సమయం అవసరమవుతుందన్నారు. అనంతరం ధర్మాసనం ఈ కేసుకు సంబంధించి ఏపి ప్రభుత్వం సాగునీటి సంఘాలపై నివేదిక, కమిటీ ఇంతవరకు చేసిన అధ్యయనంపై నాలుగు వారాల్లోగా హైకోర్టుకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అనంతరం కేసు విచారణను వాయిదా వేసింది.
‘సగం హామీలు
రెండేళ్లలోనే అమలు’
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 8: ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు టిడిపి ఇచ్చిన హామీలను రెండేళ్ల కాలంలో సగానికి పైగా అమలుచేశామని వినుకొండ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు పేర్కొన్నారు. బుధవారం నాడు ఆయన మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డికి తెలుగుదేశం పార్టీ నేతలపై కేసులు పెట్టే అర్హత లేదని అన్నారు. హామీల అమలు గురించి కూడా మాట్లాడే అర్హత జగన్‌కు లేదని చెప్పారు. 16వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉన్నా రెండేళ్ల కాలంలో మేనిఫెస్టోలో ఇచ్చిన 400 హామీల్లో 250 హామీలను అమలుచేశామని పేర్కొన్నారు.
రైళ్లలో ‘జనని సేవ’ ప్రారంభం
న్యూఢిల్లీ, జూన్ 8: రైళ్లలో ప్రయాణించే బాలింతలు, చిన్న పిల్లల తల్లుల సౌకర్యంకోసం రైల్వే శాఖ ‘జనని సేవ’ పేరుతో ఒక పథకాన్ని ప్రారంభించింది. రైల్వే మంత్రి సురేశ్ ప్రభు బుధవారం ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద చిన్న పిల్లలకు అత్యవసరమైన వేడిపాలు, వేడి నీళ్లు లాంటి వస్తువులు రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉంచుతారు. రైళ్లలో కాని, రైల్వే స్టేషన్లలో కాని పాలు లాంటివి లభ్యం కాకపోవడంపై ఒక మహిళ చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న తర్వాత తాము ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు పథకాన్ని ప్రారంభించిన తర్వాత సురేశ్ ప్రభు చెప్పారు. ‘రైల్లో పాలు లభించకపోవడంపై ఒక సారి ఓ మహిళ ట్వీట్ చేసింది. సామాజిక మాధ్యమంలో ఆమె పిర్యాదును పరిగణనలోకి తీసుకుని మేము రైల్లో పాలు లభ్యమయ్యేలా చేశాం’ అని ఆయన చెప్పారు. తొలుత ఈ పథకాన్ని న్యూఢిల్లీ, ముంబయి సెంట్రల్, హౌరా, చెన్నై, నాగపూర్, పుణె, సూరత్, లక్నో మొరాదాబాద్ సహా 25 రైల్వే స్టేషన్లలో ఈ పథకాన్ని ప్రారంభించారు. బేబీ ఫుడ్‌తో పాటుగా 5నుంచి 12 ఏళ్ల వయసు పిల్లల కోసం బర్గర్లు లాంటి తినుబండారాల మెనూను కూడా రైల్వేలు ప్రారంభించాయి.