రాష్ట్రీయం

ఇదిగో.. రెండో విడత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 9: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని రాష్ట్భ్రావృద్ధికి సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్యాంకర్లకు పిలుపునిచ్చారు. గురువారం విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో 1,65,538 కోట్ల రూపాయల అంచనాతో రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. రెండో విడత రుణ మాఫీగా 3,500 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నామని, వీటిని రైతుల ఖాతాల్లోకి జమచేస్తున్నామని తెలిపారు. రుణ మాఫీ మొత్తాన్ని తీసుకోకుండా బ్యాంకుల్లో ఉంచుకున్న వారికి వడ్డీ చెల్లించాలని, అత్యవసరమనుకున్న రైతులకు ఆ మాఫీ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని బ్యాంకర్లను కోరారు. కేవలం రుణ ప్రణాళికను ఆమోదించినంత మాత్రాన సరిపోదని, దాని అమలులో కూడా వేగాన్ని, ఉత్సాహాన్ని చూపించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. రుణ ప్రణాళికలో పేర్కొన్న విధంగా ప్రాధాన్యత రంగాలకు పెద్దపీట రాష్ట్ర ప్రగతికి తోడ్పడాలన్నారు. ప్రాధాన్యతా రంగాలకు కేటాయించిన రుణాలను ఇతర పథకాలకు మళ్లిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఒక రకంగా ఆలోచిస్తుంటే, బ్యాంకర్లు మరో రకంగా ఆలోచిస్తున్నారని,దీని వల్ల సత్ఫలితాలు రావడం లేదన్నారు. బ్యాంకర్లు, ప్రభుత్వం సమన్వయంతో పనిచేయకపోతే ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పారు.సామాజిక భద్రతలో భాగంగా నిరుపేదలకు పించన్లు ఇస్తున్నామని, త్వరలోనే ప్రతి ఇంటికి శత శాతం గ్యాస్ కనెక్షన్లు అందిస్తామని స్పష్టం చేశారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరచాలన్న సంకల్పంతో విద్యుత్ భద్రత, పశుగ్రాస భద్రతనూ కల్పిస్తున్నామన్నారు. గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలే ఇకపై బ్యాంకింగ్ కరస్పాండెంట్లుగా పనిచేస్తారని ప్రకటించారు. జూలై నుంచి కృష్ణా జిల్లాలో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేస్తామన్నారు.
మరో రూ.500 కోట్లు ఇవ్వాలి
స్మార్ట్ విలేజ్‌ల కోసం నాబార్డ్ కేటాయించిన 500 కోట్లు ఎంత మాత్రం సరిపోదని మరో 500 కోట్ల రూపాయలు అదనంగా అందించాలని ముఖ్యమంత్రి కోరారు. ఇందుకోసం అవసరమైతే నాబార్డ్ చైర్మన్‌తో మాట్లాడతానన్నారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించే వ్యవసాయ ప్రణాళికలను రూపొందిస్తున్నామని, ఇటీవల ప్రభుత్వం చేపట్టిన జల సంరక్షణ పథకాలు మంచి ఫలితాలను ఇచ్చాయని చెప్పారు. రాయలసీమలో మూడు టిఎంసిల భూగర్భ జలాలు పెరిగాయని, ఒక్కో టిఎంసి ద్వారా లక్ష ఎకరాలకు నీరు ఇవ్వచ్చని చెప్పారు.
2015-16 ఆర్థిక సంవత్సరంలో 1,25,748 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక ఉంటే, 2016-17లో రుణ ప్రణాళిక 1,65,538 కోట్లకు పెంచామని చంద్రబాబు చెప్పారు. గత ఏడాదికన్నా ఇది 32 శాతం అధికమని ఆయన వివరించారు. వ్యవసాయానికి క్రెడిట్ ఫ్లో వార్షిక లక్ష్యం 96,920 కోట్ల కాగా, 1,04,495 కోట్లతో ప్రోత్సాహకంగా ఉందన్నారు.
ఇవీ కేటాయింపులు
2016-17 వార్షిక రుణ ప్రణాళికలో ఆయా రంగాలకు 1,65,538 కోట్ల రూపాయలు కేటాయించాలని చంద్రబాబు ప్రతిపాదించారు. వాటికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్వల్ప ఉత్పాదక రుణాలకు 60 వేల కోట్లు,వ్యవసాయ టెర్మ్ లోన్‌లకు 19,969 కోట్లు, వ్యవసా వౌలిక సదుపాయాలకల్పనకు 2,051 కోట్లు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు 983 కోట్లు మొత్తం 83,003 కోట్ల రూపాయలను వ్యవసాయ రంగానికి కేటాయించారు. అలాగే మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌కు 9,122 కోట్లు, స్మాల్ ఎంటర్‌ప్రైజెస్‌కు 11,145 కోట్లు, మీడియం ఎంటర్‌ప్రైజెస్‌కు 4,733 కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రతిపాదించారు. మొత్తంమీద పారిశ్రామిక రంగానికి 25,000 కోట్ల రూపాయలు కేటయించారు. అలాగే విద్యా రుణాలకు 2,155 కోట్లు, హౌసింగ్‌కు 4,660 కోట్లు, పిఎంఎవై హౌసింగ్ రుణాల కోసం 7,340 కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రతిపాదించారు.

చిత్రం రుణ ప్రణాళికను విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు