రాష్ట్రీయం

ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూన్ 9: రాష్ట్రంలో విద్యావ్యవస్థను పటిష్ఠం చేసేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖామంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. గురువారం ఖమ్మంలో విలేఖరులతో మాట్లాడుతూ విద్య వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందించేందుకు 20కోట్లను వెచ్చించనున్నామన్నారు. 1.50లక్షల మంది పేద విద్యార్థులు నాణ్యమైన విద్య అందనుందన్నారు. రాష్ట్రంలో పాఠశాలల భవన నిర్మాణాల కోసం 9కోట్లు మంజూరు చేశామన్నారు. ఇంటర్ విద్యార్థులకు ఉచిత విద్యతోపాటు మధ్యాహ్న భోజన పథకాన్ని ఈ ఏడాది నుంచి అమలు చేయనున్నట్లు వెల్లడించారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో 28లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట పేరుతో గ్రామాల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ నెల 30లోగా అన్ని ప్రభుత్వ కళాశాలల్లో సిసి కెమెరాలు, బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు.