రాష్ట్రీయం

పేదలకు దివ్య దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 9: రాష్ట్రంలో పేదలకు దేవుని దర్శనాన్ని మరింత సులభంగా, ఉచితంగా జరిపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దివ్య దర్శనం పేరుతో ప్రభుత్వం చేపడుతున్న ఈ వినూత్న పథకం వలన చాలా మంది నిరుపేదలు తిరుమల వెంకన్న స్వామి దగ్గర నుంచి మిగిలిన దేవుళ్లందరినీ పైసా ఖర్చు లేకుండా దర్శించుకోవచ్చు. దీనికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాల్లోని పేదలను, అలాగే మిగిలిన వర్గాల్లోని నిరు పేదలను ఒక్కో జిల్లా నుంచి పది వేల మంది పేదలను ఎంపిక చేస్తుంది. వీరికి ఉచిత రవాణా, దర్శనం, పూజలు చేయించి తిరిగి వెనక్కు తీసుకువస్తుంది. ప్రతి కుటుంబం నుంచి గరిష్ఠంగా ఐదుగురిని ఈ దైవ దర్శనానికి తీసుకువెళ్లనున్నారు. రాష్ట్రంలోని ఏడు ప్రధాన దేవాలయాల దర్శనం చేయిస్తారు.
18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయసు కలిగిన వారిని దైవ దర్శనానికి తీసుకువెళ్లనున్నారు. ఈ ప్రత్యేక టూర్లకు సంబంధించి ఆర్టీసి అధికారులతో సమన్వయం చేసుకోవలసిన బాధ్యతను దేవాదాయ ధర్మాదాయ శాఖకు ప్రభుత్వం అప్పగించింది. దేవాదాయశాఖ కమిషనర్, టిటిడి ఈఓ, ఎంపిక చేసిన ఏడు దేవాలయాల ఈఓలు, ఈ భక్తుల బాధ్యతలను చూసుకుంటారు. వీరికి దివ్య దర్శనాన్ని కూడా చేయించనున్నారు. ఈ టూర్‌లో దేవాదాయశాఖకు చెందిన ఒక అధికారి యాత్రికుల వెంట ఉంటారు. తిరుమల వెంకటేశ్వరస్వామి దివ్య దర్శనంతోపాటు, ఉచిత వసతి సౌకర్యాన్ని కూడా యాత్రికులకు కల్పించనున్నారు.