రాష్ట్రీయం

మైనింగ్ సంస్థలన్నింటికీ రేటింగ్ వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 9: దేశంలో ఉన్న మైనింగ్ సంస్థలు అన్నింటికీ రేటింగ్ ఇచ్చే వ్యవస్థను వచ్చే నెల నుండి ప్రారంభిస్తామని కేంద్ర గనుల శాఖ కార్యదర్శి బల్విందర్ కుమార్ తెలిపారు. మైనింగ్ సంస్థలకు రేటింగ్‌ను ఇవ్వడం కోసం కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్మార్టు గవర్నమెంట్ అందించనుంది. గురువారం నాడు కవాడిగూడలోని కేంద్రీయ సంస్థల కార్యాలయాల సముదాయంలో జరిగిన కార్యక్రమంలో దీనికి సంబంధించిన అవగాహన ఒప్పందంపై ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ అధికారుల మధ్య ఒప్పందంపై బల్విందర్‌కుమార్ సమక్షంలో సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా బల్విందర్ మాట్లాడుతూ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజన్సీ సహకారంతో అక్రమ మైనింగ్‌ను గుర్తించే పరిజ్ఞానాన్ని అందుబాటులో తెచ్చామని అన్నారు. స్టార్ రేటింగ్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉత్తమ రేటింగ్ పొందే మైనింగ్ సంస్థలకు అవార్డులు, రివార్డులతో పాటు తక్కువ రేటింగ్ పొందే మైనింగ్ సంస్థలకు జరిమానా విధిస్తామని అన్నారు. ఎన్‌ఐఎస్‌జి అందించే సాఫ్ట్‌వేర్ సహకారంతో గనుల మంత్రిత్వశాఖ రూపొందించే స్టార్ రేటింగ్ పద్ధతి మైనింగ్ సంస్థల మధ్య పోటీతత్వాన్ని పెంచి ప్రజలకు, ప్రభుత్వానికి ఉపయోగపడుతుందని అన్నారు.