రాష్ట్రీయం

‘ప్రైవేట్ బస్సుల అక్రమ రవాణాను అడ్డుకుంటాం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 9: ప్రైవేట్ బస్సుల అక్రమ రావాణాను నియంత్రించకపోతే అడ్డుకుంటామని టిఎస్‌ఆర్టీసి ఎంప్లారుూస్ యూనియన్ హెచ్చరించింది. ఈ మేరకు గురువారం రాత్రి ఎల్‌బి నగర్, ఆరాంఘర్ చౌరస్తాలో కొన్ని ప్రైవేటు వాహనాలను అడ్డుకోవడం జరిగిందని యూనియన్ నాయకులు ఎస్ బాబు, కె రాజిరెడ్డి తెలిపారు. గత ఉమ్మడి ప్రభుత్వంలోనే సీమాంధ్రుల ప్రైవేటు బస్సులు తిరిగేవని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇంకా ఎక్కువగా తిరుగుతున్నప్పటికీ ట్రాన్స్‌పోర్ట్ విభాగం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తాము ప్రత్యక్ష పోరుకు దిగాల్సి వస్తోందన్నారు. కాంట్రాక్టు క్యారేజీలుగా పర్మిట్లు పొంది స్టేజి క్యారేజీలుగా బస్సులు తిప్పుతూ ఆర్టీసికి సాలీనా వెయ్యి కోట్లు నష్ట పరుస్తున్నారని విమర్శించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రైవేటు బస్సుల అక్రమ రవాణాను అరికట్టి తెలంగాణలో ఆర్టీసిని బలోపేతం చేయాలని కోరారు.