రాష్ట్రీయం

నిద్ర వీడండి.. ముద్ర పెంచండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 9: పార్టీ-ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టడంలో నాయకుల నిరాసక్తతపై తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకత్వం అసంతృప్తితో ఉంది. చివరకు కీలకమైన అంశాలు, ఆరోపణలపై సైతం నేతలు నిద్ర వీడకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. కొన్ని అంశాల్లో పైచేయి సాధిస్తున్నప్పటికీ, ముఖ్యమైన అంశాల్లో ఎదురుదాడి పెంచకపోవడంపై పార్టీ విశే్లషణ విభాగం పెదవి విరిచింది. నిద్ర వీడి, పార్టీ ముద్ర తెలుగు రాజకీయ ముఖచిత్రంపై బలంగా వేయాలని సూచించింది. ఆ మేరకు తన సూచనలతో కూడిన అభిప్రాయాలను నాయకత్వానికి పంపినట్లు సమాచారం.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కొద్దికాలం క్రితం నుంచి తెలుగుదేశం పార్టీ-ప్రభుత్వంపై వైసీపీ, కాంగ్రెస్, బిజెపిలు చేస్తున్న విమర్శలకు సంబంధించి సొంత పార్టీ నేతలు చేస్తున్న ప్రతి విమర్శలు, ప్రత్యారోపణలపై టిడిపి నాలెడ్జ్‌సెంటర్ ఒక విశే్లషణను నాయకత్వానికి పంపించింది. విపక్షాల విమర్శలతోపాటు, ప్రత్యేక హోదా, బాబు దుబారా, కేసీఆర్‌కు బాబు భయపడుతున్నారన్న ఆరోపణలపై ప్రజాభిప్రాయంతోపాటు, నాయకుల ప్రతి విమర్శల తీరును నాలెడ్జ్ సెంటర్ లోతుగా విశే్లషించింది.కీలకమైన విమర్శలపై తమ పార్టీ నేతలు వౌనం వహిస్తున్నట్లు ఈ విశే్లషణ గుర్తించింది. ముఖ్యంగా..ఏపీలో లోటు బడ్జెట్ ఉందని చెప్తూనే బాబు దుబారా చేస్తున్నారంటూ వస్తున్న విమర్శలను ఖండించడంలో నేతలు, మంత్రులు వెనుకబడి ఉన్నారని పేర్కొంది. దానితోపాటు ఓటుకునోటు కేసు భయంతో అటు కేంద్రం, ఇటు కేసీఆర్‌తో బాబు మెతకగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపైనా నేతలు స్పందించడం లేదని స్పష్టం చేసింది. బాబు నోరు తెరిస్తే అబద్ధాలాడుతున్నారని, పాలనంతా మోసం అని రోజూ జగన్ చేసే ప్రచారంపైనా తగినరీతిలో ప్రతి విమర్శలు చేయడం లేదని గుర్తించింది. మేనిఫెస్టో హామీలేవీ అమలు కావడం లేదని, తెలంగాణలో టిడిపి కనుమరుగవుతుందన్న విమర్శలతోపాటు.. రైతు, డ్వాక్రా రుణమాఫీ హామీలో బాబు మోసం చేశారన్న ఆరోపణలను ఖండించి, తగిన సమాచారం ఇచ్చి సానుకూల ప్రచారం చేయటంలో విఫలమయ్యామని నాయకత్వానికి నివేదిక ఇచ్చింది.రైతు రుణమాఫీకి వైఎస్ తన హయాంలో ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాలకు 1004 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టగా, బాబు 13 జిల్లాలకు ఇప్పటికే 8 వేల కోట్లు ఖర్చుపెట్టారన్న వాస్తవాన్ని రైతులకు చేర్చడంలో వెనుకబడినట్లు నాయకత్వానికి నివేదిక సమర్పించింది. వైఎస్ పెట్టిన ఖర్చులకు ఫలితాలు రాలేదని, బాబు పెట్టిన ఖర్చులకు వేలకోట్ల పెట్టుబడులు వచ్చాయన్న విషయాన్ని కూడా, ప్రజల్లోకి తీసుకుపోలేకపోయామని పేర్కొంది. లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ అన్ని హామీలూ నెరవేరుస్తున్నా, వాటికి తగిన స్థాయిలో ప్రచారం చేసుకోలేకపోతున్నామని పేర్కొంది. కాగా, అమరావతిలో పూలే విగ్రహ ఏర్పాటుపై ప్రకటన చేస్తే బాగుంటుందని నాయకత్వానికి సూచించింది. ఇంటర్ పాస్ అయిన వారికి వెయ్యి, డిగ్రీ పాసయిన వారికి 1500, పీజీకి 2వేల చొప్పున నిరుద్యోగ భృతి ఆలస్యం చేయకుండా మంజూరు చేయాలని సలహా ఇచ్చింది. వారికి ఒక్కొక్కరికి వందమందిని అక్షరాస్యులను చేసే బాధ్యత ఇవ్వాలని సూచించింది. ఏదైనా ఒక అంశంపై సీఎం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని, రాజ్యసభ టికెట్ల నేపథ్యంలో బీసీ, మాదిగల్లో అసంతృప్తి పెరగకుండా చూడాలని, ప్రభుత్వ ప్రకటనలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, అన్న క్యాంటిన్లు త్వరగా ప్రారంభించాలని, ఇళ్ల నిర్మాణాలు సాధ్యం కాని చోట దూరంగానైనా స్థలాలు ఇవ్వాలని, వైఎస్ ఆరేళ్లలో 30 శాతం హామీలే నెరవేరిస్తే బాబు రెండేళ్లలో మెజారిటీ హామీలు నెరవేర్చారన్న ప్రచారం చేయాలని పార్టీ నాయకత్వానికి సలహా, సూచనలిచ్చింది.
ముద్రగడపై మన లైన్ సక్సెస్
కాగా ముద్రగడ ఆందోళన నేపథ్యంలో, కాపులు జగన్ వైపు వెళ్లకుండా.. 2004 మేనిఫెస్టోలో వైఎస్ కాపు రిజర్వేషన్ హామీని విస్మరించారన్న బాబు లైన్ సక్సెస్ అయిందని కితాబు ఇచ్చింది. ముద్రగడ జగన్ ఏజెంటని, తుని విధ్వంసం జగన్ ముఠా కుట్రేనన్న టిడిపి వాదన జనంలోకి బాగా వెళ్లిందని ప్రశంసించింది. ఈ విషయంలో కళా వెంకట్రావు, రామానుజయ, కాపు-బలిజ మంత్రులు, ఎమ్మెల్యేలు చురుకుగా వ్యవహరించారని అభినందించింది. బీసీ కమిషన్ నివేదికను ఆగస్టులోగా పూర్తి చేసి, భవిష్యత్తులో తుని లాంటి ఘటనలు ఎదురుకాకుండా ఉండాలంటే ఇప్పుడు కొంత రిస్కు తీసుకోక తప్పదని స్పష్టం చేసింది. ఇప్పటివరకూ బిజెపి విమర్శలపై మన పార్టీ వాదమే పైచేయిగా ఉందని, కాంగ్రెస్ ప్రైవేటు బిల్లుకు మద్దతునివ్వాలన్న బాబు లైన్.. కాంగ్రెస్-వైసీపీ వ్యూహానికి బ్రేకులు వేసిందని పేర్కొంది. జగన్ పార్టీ రాజధాని భూదందాపై చేసిన ఆరోపణలను ఖండించి, ప్రజలు ఆ ప్రచారం నమ్మకుండా నిలువరించారని అభినందించింది. రోజా-కాల్‌మనీ అంశాలపై ప్రభుత్వానిదే పైచేయి అయిందని, రోజా మాటలకు విలువ లేకుండా విజయం సాధించిందని పేర్కొంది. బాబును చెప్పుతోకొట్టాలన్న జగన్ విమర్శపై నేతలు, ప్రభుత్వం సమర్థవంతంగా ఎదురుదాడి చేశారని కితాబు ఇచ్చింది.