రాష్ట్రీయం

దక్షిణ మధ్య రైల్వేలో సమ్మె సైరన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 9: దక్షిణ మధ్య రైల్వేలో సమ్మె సైరన్ మోగింది. జూలై 11 ఉదయం గం. 6.00ల నుంచి సమ్మె చేస్తున్నట్టు రైల్వే కార్మిక సంఘాలు గురువారం మధ్యాహ్నం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తాకు సమ్మె నోటీసు ఇచ్చాయి. ఏడో వేతన సంఘం సిఫారసులు అమలు చేయాలని, కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ, పాత పెన్షన్ విధానానే్న అమలు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. అంతకు ముందు దక్షిణ మధ్య రైల్వేకు చెందిన ఎనిమిది కార్మిక సంఘాల ఆధ్వర్యంలో యూనియన్ కేంద్ర కార్యాలయం నుంచి సికిందరాబాద్ సంచాలన్ భవన్ వరకు వేలాది కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ శంకర్‌రావు మాట్లాడుతూ రైల్వే సిబ్బందికి కనీస వేతనం రూ. 26వేలు చెల్లించాలని, సర్వీసు మొత్తంలో ఐదు ప్రమోషన్లు, 5శాతం ఇక్రిమెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఎనిమిది గంటల డ్యూటీ, ఆఫీసర్లకు ఆరు గంటల డ్యూటీ సమయాన్ని క్రమబద్దీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ రూ. 7వేలు చెల్లించాలని, 2014-2015కు సంబంధించి బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రైల్వే క్వార్టర్స్‌ల మరమ్మతులను చేపట్టి స్ట్ఫా క్వార్టర్స్‌లో కనీస సౌకర్యాలు కల్పించాలని, మెరుగైన వైద్య సేవలందించాలని, రైల్వేలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని శంకర్‌రావు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు సత్వరమే పరిష్కరించాలని లేనిపక్షంలో జూలై 11 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు కె శ్రీనివాస్‌తోపాటు యూనియన్ అసిస్టెంట్ సెక్రటరీ, ఎఐఆర్‌ఎఫ్ కన్వీనర్, రీజినల్ జెసిఎ, రాజారామ్మోహన్, టి కళావతి, ఉదయ్‌శంకర్ రావు, ఎవి రమణరావు,యూనియన్ ప్రతినిధులు హనుమంతరావు, విజయ్‌కుమార్, యాసిన్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం దక్షిణ మధ్య రైల్వే జిఎం రవీంద్ర గుప్తాకు సమ్మె నోటీసు అందజేస్తున్న కార్మిక సంఘాల ప్రతినిధులు