రాష్ట్రీయం

కాలు కోసేసిన డాక్టర్‌పై చర్యలేవి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 9: నిఖిల్‌రెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కాళ్లు ఎత్తు పెంచడానికి అనైతికంగా, అశాస్ర్తియ పద్ధతిలో ఆపరేషన్ చేసిన గ్లోబల్ ఆస్పత్రి సిఇఓ శివాజీ చటోపాధ్యాయ, డాక్టర్ చంద్రభూషణ్‌లపై క్రిమినల్ కేసులు నమోదుచేయాలని బిజెపి శాసనసభాపక్ష నాయకుడు జి కిషన్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను డిమాండ్ చేశారు. బిజెపి శాసనసభా పక్ష ఉపనేత చింతల రామచంద్రారెడ్డి, డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, ఎమ్ చంద్రయ్య తదితరులతో కలిసి కిషన్‌రెడ్డి గురువారం నాడు రాజీవ్‌శర్మను కలిసి ఒక వినతి పత్రం ఇచ్చారు. గ్లోబల్ ఆస్పత్రి యాజమాన్యం తక్షణమే నిఖిల్‌రెడ్డికి పూర్తిస్థాయి ఉచిత వైద్యం అందించాలని అన్నారు. నిఖిల్‌రెడ్డికి కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, మెడికల్ కౌన్సిల్ నిబంధనలు ఉల్లంఘించిన గ్లోబల్ ఆస్పత్రి లైసెన్స్‌ను రద్దు చేయాలని కోరారు. నిఖిల్‌రెడ్డికి సర్జరీ చేసిన చంద్రభూషణ్ వైద్య వృత్తి చేయకుండా నిషేధించాలని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన గ్లోబల్ ఆస్పత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ సంఘటనపై నిపుణులైన డాక్టర్లతో విచారణ చేయించాలని , భవిష్యత్‌లో ఇటువంటి సంఘటనలు జరగకుండా కార్పొరేట్ ఆస్పత్రులపై నిఘా పెంచాలని అన్నారు. ఈ సందర్భంగా నిఖిల్‌రెడ్డి తండ్రి మాట్లాడుతూ తన కొడుకుకు తప్పుడు సమాచారం ఇచ్చి సర్జరీ పేరుతో కాళ్లు పోగొట్టుకున్నారని అన్నారు. ఈ రోజు తన కొడుకు హాస్పిటల్‌లో బెడ్‌పై నరకయాతన అనుభవిస్తున్నాడని, రెండు నెలలు అయినా తన కొడుక్కి సరైన వైద్యం అందించలేదని పేర్కొన్నారు. గ్లోబల్ ఆస్పత్రి వైద్యులపైనా, యాజమాన్యంపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.