రాష్ట్రీయం

కృష్ణా ప్రాజెక్టులపై నేటి నుంచి అధ్యయనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 9: కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులపై అధ్యయనం కోసం తెలంగాణ ప్రభుత్వ పక్షాన ప్రత్యేక బృందం శుక్ర శనివారాల్లో రెండు రోజుల పాటు కర్నాటకలో పర్యటిస్తుంది. కృష్ణా జలాల పునః పంపిణీకి సంబంధించి సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నందున ఈ అధ్యయనానికి శ్రీకారం చుడుతున్నారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ నాయకత్వంలోని ఈ బృందం శుక్రవారం ఉదయం పది గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరుతుంది. తెలంగాణ అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, సీనియర్ న్యాయవాదులు జి విద్యాసాగర్, రవీందర్‌రావు, అంతర్ రాష్ట్ర జలవనరుల చీఫ్ ఇంజనీర్ నర్సింహారావు, డిప్యూటీ డైరెక్టర్ కోటేశ్వరరావు, నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఓఎస్‌డి శ్రీ్ధర్‌రావు దేశ్‌పాండే ఈ బృందంలో ఉంటారు. శుక్రవారం నారాయణపూర్, అలమట్టిలను పరిశీలిస్తారు. అలమట్టిలో రాత్రి బస చేసి అనంతరం శనివారం తుంగభద్రను ఈ బృందం పరిశీలిస్తుంది.