రాష్ట్రీయం

వందేళ్ల వర్శిటీకి వైస్ చాన్సలర్ కరవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 10: వందేళ్లు నిండుతున్న ఉస్మానియా యూనివర్శిటీకి గత రెండేళ్లుగా వైస్ చాన్సలర్ కరవుయ్యారు. 1917లోప్రారంభమైన ఉస్మానియా యూనివర్శిటీ కొద్ది నెలల్లో వందేళ్ల పండుగను చేసుకోబోతోంది. ఆ తరుణంలో కూడా వైస్ చాన్సలర్ నియామకం జాప్యం చేయడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే అత్యంత పురాతనమైన వర్శిటీల్లో ఉస్మానియా ఒకటి కాగా, హైదరాబాద్ స్టేట్‌లో తొలి విశ్వవిద్యాలయం. 2014 నవంబర్ 11 నుండి ఇన్‌చార్జిల పాలనతోనే వర్శిటీ నెట్టుకుంటూ వస్తోంది. ఫలితంగా 2013 పిహెచ్‌డి అడ్మిషన్లను 2016లో ప్రారంభించింది. మిగిలిన సంవత్సరాల పిహెచ్‌డి అడ్మిషన్లు ఎపుడవుతాయో తెలియని అయోమయ పరిస్థితి. ఆ మాటకొస్తే తెలంగాణలో ఉన్న ఆరు సంప్రదాయ వర్శిటీలు, మరో ఆరు స్పెషలైజ్డ్ వర్శిటీల దుస్థితి కూడా ఇదే. ఒక దశలో ఎవరిని నియమించాలో తెలియక, ఐఎఎస్ అధికారులను తెలంగాణ ప్రభుత్వం ఇన్‌చార్జి విసిలుగా నియమించింది. రెండుపడవలపై కాళ్లు వేసిన వారు తమ అసలు ఉద్యోగం వదులుకోలేక, యూనివర్శిటీల ఇక్కట్లు వినలేక పాలన స్తంభించి, వివాదాలు పతాక స్థాయికి చేరుకుని అసలు లక్ష్యాలు నీరుగారిపోయాయి. మహాత్మాగాంధీ యూనివర్శిటీని తీసుకుంటే తొలుత ప్రొఫెసర్ వి గంగాధర్ ఇన్‌చార్జిగా ఉన్నారు. ఆయన 2010లో రిటైర్ కాగానే అదే రోజు ప్రొఫెసర్ వి గోపాలరెడ్డిని ఇన్‌చార్జిగా పెట్టారు. ఆయన రిటైరయ్యాక ప్రొఫెసర్ టి తిరుపతిరావును, ఆ తర్వాత ప్రొఫెసర్ డి ఎన్ రెడ్డిని ఇన్‌చార్జిగా పెట్టారు. 2011 మే 18న ఆయన స్థానంలో రెగ్యులర్ వీసి కె నర్సింహరెడ్డిని నియమించారు. ఆయన 2014లో రిటైర్ కాగానే మరోమారు ఇన్‌చార్జిల పాలన మొదలైంది. ఏడుగురు ఇన్‌చార్జి విసిలతో విద్యాత్మక అంశాలు ,వార్షిక ప్రణాళికలు తీవ్రంగా దెబ్బతిన్నాయని విద్యార్థులు వాపోతున్నారు. అదే దుస్థితి వరంగల్‌లోని కాకతీయ యూనివర్శిటీకి పట్టింది. ముగ్గురు ఇన్‌చార్జిలు మారినా రెగ్యులర్ విసికి దిక్కులేకుండా పోయిందని ఫ్యాకల్టీ సభ్యులు వాపోతున్నారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీకి సైతం తొలుత వికాస్ రాజ్ ఇన్‌చార్జి విసిగా నియమితులుకాగా, ఆయన స్థానంలో 2015లో రంజీవ్ ఆర్ ఆచార్య బాధ్యతలు స్వీకరించారు. మిగతా యూనివర్శిటీలదీ అదే స్థితి.
వివాదాలు
విసిల నియామకానికి సంబంధించి ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న యుజిసి చట్టాన్ని మార్చి కొత్త నిబంధనలను అమలుచేయాలని, చాన్సలర్‌గా గవర్నర్ స్థానే ముఖ్యమంత్రిని నియమించాలని చూడటంతో వివాదాలు మొదలయ్యాయి. దాంతో విసిల నియామకాల్లో తీవ్ర జాప్యం జరిగింది. గత ఏడాది డిసెంబర్‌లో విసిల నియామకానికి నోటిఫికేషన్ జారీ అయింది. ఇప్పటికే విసి పదవుల కోసం 2400 దరఖాస్తులు వచ్చాయి. అందులో కనీస నిబంధనలు పాటించని సగానికి పైగా అభ్యర్థుల బయోడాటాలను పక్కన పెట్టేసిన ప్రభుత్వం మిగిలిన వాటిని కొంత మంది విద్యావేత్తలకు పంపించి వారి అభిప్రాయాలను సేకరించింది. మరో పక్క సెర్చి కమిటీలకు బయోడాటాలను పంపించి వారి నివేదికలను సైతం తెప్పించుకుంది. వెనుకబాటుతనం నుండి బయటపడటానికి ప్రత్యేక రాష్ట్రం వచ్చిన సందర్భంలో విసిల నియామకాలు జరగకపోవడంతో విద్యావ్యవస్థ మరింత వెనుకబడిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తొలి రోజుల్లో సిఎం చేసిన కొన్ని నియామకాలపై తర్వాత కొంత ఆలోచనల్లో పడటం వల్ల కనీసం ఈ దశలోనైనా సమర్థులను, విద్యావేత్తలను, పరిపాలనా దక్షుల్ని విసిలుగా నియమిస్తారనే ఆశలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి