రాష్ట్రీయం

బాబుతో లాయర్ గంగూలీ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 11: కృష్ణా జలాల విషయంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న విభేదాలపై సుప్రీంకోర్టులో అనుసరించాల్సిన వైఖరిపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఎకె గంగూలీతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. విజయవాడలోని సిఎం కార్యాలయంలో గంగూలీ ముఖ్యమంత్రిని కలిశారు. శ్రీశైలం దగ్గర కృష్ణానదిపై చేపట్టిన పాలమూరు, రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాల వివరాలను సిఎం గంగూలీకి వివరించారు. ఎటువంటి అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిందని, దీనిపై సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ తరపున వాదనలు వినిపించాలని గంగూలీని సిఎం కోరారు. కృష్ణా ప్రాజెక్ట్‌లను కెఆర్‌ఎంబి పరిధిలోకి తీసుకోవద్దని తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి, కేంద్ర మంత్రి ఉమాభారతిపై వత్తిడి తేవడం సరికాదని సిఎం అభిప్రాయపడ్డారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌లకు వచ్చిన నీటిని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య కెఆర్‌ఎంబి ఇచ్చిన ఆదేశాలను సాగర్ ప్రాజెక్ట్ అధికారులు అమలు చేయకపోవడం వలన ఎపికి నష్టం వాటిల్లుతోందని అన్నారు. ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు పోలవరం ముంపు ప్రాంతాలపై సుప్రీం కోర్టులో వేసిన కేసులపై కూడా కూలంకషంగా చర్చించారు. ఈ విషయంలో ఎపి తరపున పటిష్టమైన వాదనలను వినిపించాలని ఆయన గంగూలీని కోరారు.