రాష్ట్రీయం

టెక్నాలజీయే శ్రీరామరక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 11: రాష్టంలో 13 జిల్లాలు, జలవనరుల ప్రధాన ప్రాజెక్ట్‌లతో అనుసంధానమైన అత్యాధునిక వ్యవస్థతో కూడిన వీడియోకాన్ఫరెన్స్ విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ప్రారంభించారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఇరిగేషన్ శాఖ అధికారులతో ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానంతో వివిధ ప్రాజెక్ట్‌ల పరిధిలో జలసామర్థ్యం, భూగర్భ జల స్థాయి ఎప్పటికప్పుడు కేంద్రీకృత వ్యవస్థ ద్వారా పర్యవేక్షించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ప్రతి ఒక్క నీటిబొట్టును సంరక్షించడంలో జలవనరుల శాఖ అధికారులు, సిబ్బంది ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. గత రెండు సంవత్సరాలుగా మెరుగైన పనితీరు చూపుతున్నారని, మరింత సమర్థతతో కూడిన కార్యాచరణ ఉండాలని ఆయన కోరారు. రాష్ట్రంలో భూగర్భ జలాలను పెంచాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా వినియోగంలోకి తీసుకురావడం ద్వారా జలాశయాలు, చెరువులు, కాలువలు, భూగర్భంలో నీటి లభ్యత వంటి అనేక అంశాలను కేంద్ర కార్యాలయం నుంచి పరిశీలించవచ్చని ఆయన చెప్పారు. ఒక చోట నీరు ఎక్కువగా ఉండి, మరోచోట నీరు తక్కువగా ఉంటే, ఆ నీటిని అక్కడికి పంపేలా చెక్ డ్యామ్‌లు, హైడ్రాలిక్ లిఫ్ట్ ఇరిగేషన్ తదితర విధానాలను అనుసరించాలన్నారు. కేంద్ర కార్యాలయం నుంచే 3000 నీటి సంఘాల పరిధిలో జలవనరుల స్థాయిని సమీక్షించాల్సి ఉంటుందని సిఎం చెప్పారు. స్కాడా టెక్నాలజీని మరింత విస్తృతంగా వినియోగంలోకి తీసుకురావాలని, తద్వారా రాష్ట్రంలోని మేజర్, మైనర్ ప్రాజెక్ట్‌లతో అనుసంధాన ప్రక్రియ చేపట్టాలని సిఎం వాసన్ ల్యాబ్ బృందానికి సూచించారు. లైవ్‌స్ట్రీమింగ్ టెక్నాలజీ ద్వారా వివిధ ప్రాజెక్ట్‌లలో జరిగే పనుల ప్రత్యక్ష పరిరక్షణ సాధ్యం కాదని, ఈ విధానాన్ని మరింత విస్తృతం చేసి వీడియోకాన్ఫరెన్స్ విధానానికి అనుసంధానం చేయాలని సిఎం ఆదేశించారు. కృష్ణ పుష్కర ఘాట్‌లో పనులను పర్యవేక్షిస్తున్న అధికారులతో, పోలవరం స్పిల్‌వేరాక్ పనులను పర్యవేక్షిస్తున్న చీఫ్ ఇంజనీర్ రమేష్‌బాబుతో ముఖ్యమంత్రి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. ఒకేసారి 10 లక్షల మందితో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సంభాషించేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని ఈ సందర్భంగా వాసన్ ల్యాబ్ ప్రతినిధులు సిఎంకు చెప్పారు. ప్రాజెక్ట్ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా ఒక స్క్రీన్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

చిత్రం విజయవాడలో శనివారం స్కాడా టెక్నాలజీని ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు