రాష్ట్రీయం

బంద్‌పై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ/ఏలూరు, జూన్ 11: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నిరాహారదీక్ష నేపథ్యంలో ఆందోళనకారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో శనివారం కాపుల బంద్ ప్రభావం ఎక్కడా కనిపించకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. కాకినాడ సహా అన్ని చోట్లా పోలీసులు మోహరించారు. మారుమూల ప్రాంతాల్లో సైతం బలగాలను గస్తీలో ఉంచారు. ఆందోళనకారులపై కేంద్ర, రాష్ట్ర బలగాలు ఉక్కుపాదం మోపడంతో జిల్లాలో బంద్ ప్రభావం శనివారం పెద్దగా కనిపించలేదు. ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడిలో మూడురోజులుగా పూర్తిస్థాయిలో బంద్ కొనసాగుతోంది. ముద్రగడతో పాటు ఆయన భార్య పద్మావతి, కోడలు సిరి సైతం నిరాహార దీక్షలో ఉన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో నిరాహార దీక్షలో ఉన్న ముద్రగడ వైద్య సహాయాన్ని పొందేందుకు అంగీకరించకపోవడంతో కాపు వర్గాల్లో ఆందోళన నెలకొంది. కిర్లంపూడి గ్రామాన్ని సాయుధ బలగాలు తమ అధీనంలో ఉంచుకున్నాయి. ఆందోళనకారులపై పోలీసులు ఎక్కడికక్కడే ఉక్కుపాదం మోపడంతో రెండో రోజు బంద్ ప్రభావం కనిపించలేదు. అక్కడక్కడా ఉద్యమకారులు దుకాణాలు మూసివేయించగా పోలీసులు వెనువెంటనే రంగంలోకి దిగి షాపులను తెరిపించారు. తుని దుర్ఘటనకు సంబంధించి, అరెస్టుల పర్వం ఈ నెల 13వ తేదీ నుండి మళ్లీ కొనసాగుతుందని పోలీసు వర్గాల ద్వారా తెలిసింది.

చిత్రం వైద్యం చేయడానికి ప్రయత్నిస్తున్న వైద్యులను ప్రతిఘటిస్తున్న ముద్రగడ పద్మనాభం