రాష్ట్రీయం

32 కులాలకు కార్పొరేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత నిరుపేద 32 వెనుకబడిన కులాలకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎపి కార్పొరేషన్ ఫర్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ మోస్టు బ్యాక్‌వర్డు క్లాసెస్ పేరిట ఈ కార్పొరేషన్ ఏర్పాటవుతోంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం జిఓ 17 జారీ చేసింది. ఇందులో పలు సంచార జాతులను, విముక్త జాతులను చేర్చారు. బాలసంతు, బహురూపి, బండర, బుడబుక్కల, దాసరి, దొమ్మెర, గంగిరెద్దుల, జంగం, జోగి, కాటిపాపల, కొర్చ, పిచ్చిగుంట్ల, పాముల, పార్ధి, పంబాల, గుడాల, కంజరభట్ట, కొప్మెర/ రెడ్డిక, మండిపట్ట, నొక్కర, పెరికి ముగ్గుల, రాజన్నల, కసికపాడి/ కసికపూడి తదితర కులాలున్నాయి.