రాష్ట్రీయం

నియంతృత్వానికి పరాకాష్ఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 11: కాపులకు రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ముద్రగడ పద్మనాభం దీక్ష చేపడితే, ఆయనను బలవంతంగా అరెస్ట్ చేయడం తగదని రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చిరంజీవి శనివారం బహిరంగ లేఖ రాశారు. దీక్ష చేస్తున్న ముద్రగడ, ఆయన కుటుంబ సభ్యులపట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అమానుషంగా ఉందని వ్యాఖ్యానించారు. అరెస్ట్‌లు ఏకపక్షంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఈ దృశ్యాలను ప్రసారం చేస్తున్న వార్తా ఛానళ్లను కట్టడి చేయడం ప్రభుత్వ నియంతృత్వానికి పరాకాష్టని చిరంజీవి అన్నారు. తుని ఘటనను ఎవ్వరూ సమర్థించరు. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవలసిందే. ఘటన జరిగిన తరువాత తను సమాచారం మొత్తాన్ని తెప్పించుకున్నానని, హింసాత్మక ఘటనల్లో గోదావరి జిల్లాల వారు ఎవ్వరూ లేరని, రాయలసీమ నుంచి వచ్చిన కొందరు ఈ చర్యలకు పాల్పడ్డారని ముఖ్యమంత్రి చెప్పారు. కానీ ఇప్పుడు గోదావరి జిల్లాలకు చెందిన వారిని దోషులుగా చూపించి అరెస్ట్ చేస్తున్నారు. దీనిని ముఖ్యమంత్రి ఏవిధంగా సమర్థించుకుంటారని చిరంజీవి ఆ లేఖలో ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టువిడుపులతో సమస్యలు పరిష్కరిస్తారన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని చిరంజీవి అన్నారు. కానీ ముద్రగడ విషయంలో ప్రభుత్వం మొదటి నుంచి ఘర్షణ ధోరణిలో వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. ముద్రగడ దీక్షకు రాజకీయాన్ని ఆపాదించి సమస్యలను పక్కదారి పట్టించడం వలన కలిగే ప్రయోజనాలేంటో చంద్రబాబుకే తెలియాలని అన్నారు. ప్రజా సహకారాన్ని కోరుకుంటున్న ప్రభుత్వ కొన్ని సామాజికవర్గాల మనోభావాల్ని దెబ్బతీయడం మానుకోవాలని అన్నారు. తుని ఘటనపై సిబిఐతో విచారణ జరిపించి, దోషులను చట్టానికి పట్టించాలని చిరంజీవి ఆ లేఖలో డిమాండ్ చేశారు.
మంత్రిగా ఉన్నప్పుడు
చిరంజీవి ఏం చేశారు?
కాగా చిరంజీవి లేఖ రాసిన నేపథ్యంలో ఏపి మంత్రులు ఆయనపై ఎదురుదాడి ప్రారంభించారు. చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కాపులకు ఏం చేశారని రాష్ట్ర మంత్రి నారాయణ ప్రశ్నించారు. కాపులను బిసిల్లో చేర్చేందుకు ఆయన కనీస ప్రయత్నమైనా చేశారా? అని ఆయన ప్రశ్నించారు. ఉన్నట్టుండి చిరంజీవికి కాపులు గుర్తుకు రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
కాపుల సంక్షేమం కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును చిరంజీవి విమర్శించడం తగదని హోం మంత్రి చినరాజప్ప అన్నారు. కాపుల సహకారంతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారని, అప్పుడు కాపుల మనోభావాలు దెబ్బతినలేదా? అని ఆయన ప్రశ్నించారు.