రాష్ట్రీయం

శ్లాబ్ కూలి ఇద్దరి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: హైదరాబాద్ పాత బస్తీలో దారుణం చోటుచేసుకుంది. కబూతర్ ఖానాలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం శ్లాబ్ కూలిపోయింది. శుక్రవారం రాత్రి ఒంటి గంట ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనలో ఇద్దరు మృతి చెందగా 15 మంది గాయపడ్డారు. హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలోని కబూతర్ ఖానాలో శ్రీ మహేశ్వరి సేవా ట్రస్టు విద్యాలయ్ హైస్కూల్ పాత భవనాన్ని కూల్చివేసి ఆన్‌లైన్ సిస్టంతో పాఠాలు బోధించేందుకు రెండు నెలల క్రితం నాలుగు అంతస్థులతో భవన నిర్మాణ పనులు చేపట్టారు. శ్రీమహేశ్వరి విద్యాలయ్ ప్రిన్సిపాల్ శివకుమార్ నేతృత్వంలో బిల్డర్ అమీరుద్దీన్ పర్యవేక్షణలో పనులు కొనసాగుతున్నాయి. కాగా నాలుగు అంతస్థులో మోడల్ స్కూల్‌ను ఏర్పాటు చేసేందుకు శుక్రవారం రాత్రి ఒంటి గంట ప్రాంతంలో శ్లాబ్ వేస్తున్నారు. ప్రమాదవశాత్తు శ్లాబ్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఆలూరు గ్రామానికి చెందిన నందు (25), పానగల్లు మండలం దావాజుపల్లికి చెందిన జనిగె వెంకటయ్య (40) అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలందిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న హుస్సేని ఆలం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బిల్డర్, ప్రిన్సిపాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాంట్రాక్టర్ అనంతరెడ్డి పరారయ్యాడు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందంటూ ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దక్షిణ మండల డిసిపి వి.సత్యనారాయణ, చార్మినార్ ఎసిపి అశోక్ రెడ్డి, కార్మిక శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని మృతు కుటుంబాలకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చి కార్మికుల ఆందోళనను విరమింపజేశారు. భవన నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యంపై ప్రిన్సిపాల్, కాంట్రాక్టర్‌పై సెక్షన్ 304ఏ, 337ఆర్/డబ్ల్యు, 34 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ఇదిలా ఉండగా, ఈ భవన నిర్మాణానికి అనుమతిలేదని జిహెచ్‌ఎంసి అధికారులు తెలిపారు. అక్రమంగా నిర్మాణం చేపట్టిన భవన ట్రస్టుపై ఉన్నతాధికారులకు నివేదిస్తామని టౌన్‌ప్లానింగ్ అధికారి సురేశ్ తెలిపారు.

చిత్రం కబూతర్ ఖానాలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ శ్లాబ్ కూలిన దృశ్యం.