ఆంధ్రప్రదేశ్‌

రెండు మాధ్యమాలు కొనసాగించాలి: యుటిఎఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: ఆంధ్రా మున్సిపల్ స్కూళ్లలో తెలుగు, ఇంగ్లీషు మీడియం కొనసాగించాలని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఐ వెంకటేశ్వరరావు, ప్రధానకార్యదర్శి బాబురెడ్డిలు డిమాండ్ చేశారు. పురపాల సంఘం ప్రాధమిక పాఠశాలల్లో మాతృభాషలోనే విద్యా బోధన జరగాలని వారు కోరారు. ఇంగ్లీషును ఒక సబ్జెక్టుగా బోధించాలని, అందులో ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని అన్నారు. ఉన్నత పాఠశాలల్లో ప్రస్తుతం అమలులో ఉన్న విధంగా ఇంగ్లీషు, తెలుగు సమాంతర మాధ్యమాన్ని కొనసాగించాలని, రెండు మీడియంలకు స్ట్ఫా ప్యాటర్న్ ప్రకారం పోస్టులు మంజూరు చేయాలని , ఇంగ్లీషు మీడియం బోధనకు అవసరమైన తగిన అర్హతలున్న ఉపాధ్యాయులను కొనసాగించాలని అన్నారు. మున్సిపాల్టీల పరిధి విస్తరించడం వల్ల కొత్త పాఠశాలల అవసరం ఏర్పడిందని, అలాంటి ప్రాంతాలను గుర్తించి కొత్త పాఠశాలలను ఏర్పాటు చేయాలని అన్నారు. 60 మంది విద్యార్ధులున్న ప్రాధమిక పాఠశాలలను మండల పరిషత్ పాఠశాలల మాదిరి మోడల్‌స్కూళ్లుగా అభివృద్ధి చేయాలని, మున్సిపల్ సర్వీసు రూల్స్ వెంటనే విడుదల చేయాలని, మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లోని ఎస్‌జిటి, పండిట్, పిఇటి పోస్టులను స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా అప్‌గ్రేడ్ చేయాలని అన్నారు. పాఠశాలల్లో తరగతి గదులు, వౌలిక వసతులు కల్పించాలని , డిజిటల్ తరగతుల బోధనకు కావల్సిన కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని కూడా వారు కోరారు.