రాష్ట్రీయం

పరిశోధనలు మున్ముందుకు టి.హబ్‌తో డిఆర్‌డివో భాగస్వామ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: మెరుగైన ఫలితాల కోసం టి-హబ్, డిఆర్‌డివోలు కలిసి పని చేస్తే మంచిదని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అభిప్రాయపడ్డారు. రెండింటి భాగస్వామ్యంతో నగరంలో డిఫెన్స్ టెక్నాలజీ పరిశోధనలు, స్టార్టప్‌లకు మద్దతు లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఐటి ప్రగతిని అభినందిస్తూ కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ రాష్ట్ర ఐటి మంత్రి కె తారక రామారావుకు లేఖ రాశారు. టి-హబ్‌పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి స్టార్టప్స్‌ను బలోపేతం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు. టి-హబ్‌లో భాగస్వామి కావడం ద్వారా తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు కేంద్ర రక్షణ శాఖ ఆసక్తి చూపుతోందని పారికర్ తన లేఖలో పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో నెలకొన్న డిఆర్‌డివోలో మరిన్ని సాంకేతిక పరిశోధనలు చేపట్టేందుకు, ఔత్సాహిక పరిశోధనలకు అవకాశం కల్పించేందుకు టి-హబ్‌తో కలిసి పని చేస్తామన్నారు. ఈ భాగస్వామ్యంతో హైదరాబాద్ డిఫెన్స్ టెక్నాలజీ రంగంలో స్టార్టప్ ఎకో సిస్టమ్ అభివృద్ధికి అవకాశం లభిస్తుందని పారికర్ అభిప్రాయపడ్డారు. టి-హబ్‌తో భాగస్వామ్యానికి తగిన చర్యలు చేపట్టాలని డిఆర్‌డివోను ఆదేశించినట్టు పారికర్ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే డిఆర్‌డివో బృందం టి-హబ్‌ను సందర్శించింది. రెండు మూడు విభాగాల్లో టి-హబ్‌తో భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలను పరిశీలించింది. కేంద్ర మంత్రి పారికర్ లేఖపట్ల ఐటి మంత్రి కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. నగరంలో రక్షణ రంగానికి సంబంధించిన కేంద్ర సంస్థలు, టెక్నాలజీ రంగంలో స్టార్టప్స్ ఎకో సిస్టమ్, ఏరోస్పెస్ విభాగాలు నెలకొని ఉన్నందున హైదరాబాద్‌లో ప్రత్యేకంగా డిఫెన్స్, ఏరోస్పెస్ ఇంక్యుబేటర్ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌ను కోరనున్నట్టు కెటిఆర్ తెలిపారు.
మలేషియా ప్రభుత్వం లేఖ
తెలంగాణతో వ్యాపార సంబంధాలను కోరుతూ రాష్ట్ర పరిశ్రమలు, ఐటి మంత్రికి మలేషియా ప్రభుత్వం లేఖ రాసింది. మలేషియా ప్రభుత్వం తరఫున ఆ దేశ అంతర్జాతీయ వ్యాపార, పరిశ్రమల మంత్రి ముస్త్ఫా మహమ్మద్ ఈ లేఖ రాశారు. గత నెల తెలంగాణలో పర్యటించిన తన బృందం అనేక భాగస్వామ్య అవకాశాలను పరిశీలించినట్టు తెలిపారు. తెలంగాణలోని మలేసియన్ కంపెనీలకు ప్రభుత్వం సహకరిస్తున్న తీరుకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులోనూ మలేషియా, తెలంగాణల మధ్య ఇదే విధమైన సుహృద్భావ, స్నేహసంబంధాలు పెంపొందించుకునేందుకు, తెలంగాణలోని పెట్టుబడి అవకాశాలను తెలిపేందుకు మలేషియా రావాల్సిందిగా కెటిఆర్‌ను ముస్త్ఫా కోరారు.