రాష్ట్రీయం

కళ్ళజోళ్లతో నిఘా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్తులను పట్టుకోవడంలోనూ, ట్రాఫిక్ ఉల్లం‘ఘను’లకు బ్రేక్ వేసేందుకు సైబరాబాద్ పోలీసులు మరో అడుగు ముందుకు వేశారు. మూడవ కంటితో ట్రాఫిక్ విధులు నిర్వర్తించే పరిజ్ఞానాన్ని అమ్ముల పొదిలో చేర్చుకున్నారు. జంట నగరాల్లో కళ్లజోళ్లతో పటిష్ట నిఘా పెంచారు. కళ్లజోడులో అమర్చిన కెమెరాలతో ట్రాఫిక్‌ను పర్యవేక్షించే ఈ ప్రక్రియను దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి తెచ్చారు. కళ్లజోడుకు ఉండే కుడివైపు ఫ్రేమ్‌కు అమర్చి ఉన్న ఈ కెమెరా 21 గంటలపాటు నిరంతరాయంగా చిత్రీకరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 32జిబి అంతర్గత మెమొరీ కలిగిన ఈ అధునాతన కళ్ళజోళ్లను పోలీసులు కొనుగోలు చేశారు. వీటిని ధరించిన సిబ్బంది తమ కళ్లతో చూసిన దృశ్యాలను అప్పటికప్పుడు రికార్డు అవుతాయి. ట్రాఫిక్ ఉల్లంఘనులను, వాహనదారుల ప్రవర్తనను చిత్రీకరించడంతో పాటు వీటిని ధరించిన సిబ్బంది వాహనదారులతో ప్రవర్తించే విధానాన్ని పరిశీలించేందుకు దోహదపడతాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. ఇదిలావుండగా జంట కమిషనరేట్ల పరిధిలో ఇప్పటి వరకు 75 బాడీ వోర్న్ కెమెరాలతో ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే సైబరాబాద్ పోలీసులు 25 కెమెరాలను వినియోగిస్తున్నారు. ఇవి సత్ఫలితాలిస్తుండటంతో మరో 75 కెమెరాలు అందుబాటులోకి తేవాలని పోలీసులు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కిట్ బ్యాగ్‌లు, ట్యాబ్‌లు, రహదారులపై గంటల పాటు విధులు నిర్వర్తించే క్షేత్రస్థాయి సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేసి ఒరవడిని సైబరాబాద్ పోలీస్ ఉన్నతాధికారులు కొనసాగిస్తున్నారు. ఎండ, వాన, చలితోపాటు కాలుష్యం బారి నుంచి సిబ్బందికి ఉపశమనం కలిగించే విధంగా బూట్లు, వాటర్ బాటిళ్లు, చలవ జోళ్లు, మాస్క్, రిఫ్లెక్టర్ జాకెట్, రెయిన్‌కోట్ వంటి సామగ్రితో కిట్లను అందజేస్తున్నారు.