రాష్ట్రీయం

ఎక్కడి నైరుతి అక్కడే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 13: నైరుతీ రుతుపవనాలు రాయలసీమ జిల్లాల వరకు వచ్చి ఆగిపోయాయి. గత మూడు రోజుల నుంచి ఇవి కర్నాటకలోని కార్వార్, గదగ్, ఏపీలోని ఒంగోలు వద్ద స్థిరంగా ఉన్నాయి. తెలంగాణ, కోస్తాంధ్ర జిల్లాలవైపు ముందుకు కదలడం లేదు. మరో రెండు మూడు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) శాస్తవ్రేత్త బిపి యాదవ్ తెలిపారు. అయితే నైరుతీ రుతుపవనాలు మధ్య ఉత్తర బంగాళాఖాతం, ఉత్తర తూర్పు రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, సిక్కింవైపు కదిలి వెళ్తున్నాయని వివరించారు. రుతుపవనాల కారణంగా అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయన్నారు. తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో గత 24 గంటల్లో కొద్దిపాటి వర్షాలు కురిశాయని వెల్లడించారు. వచ్చే మూడు రోజుల్లో తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో
అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, ఉరుములు, మెరుపులతో జల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండి ప్రకటించింది. ఇదే సమయంలో తూర్పు భారత్‌లోని వివిధ రాష్ట్రాల్లో భారీనుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో గత 24 గంటల్లో ఐదు నుండి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, రాయలసీమకు చెందిన కర్నూలులో కొద్దిపాటి వర్షాలు కురిశాయి. నవీపేట (నిజామాబాద్)లో ఐదు సెంటీమీటర్లు, సదాశివనగర్ (నిజామాబాద్)లో 4 సెంటీమీటర్లు, కామారెడ్డిలో నాలుగు, జఫర్‌గఢ్ (వరంగల్)లో మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోస్తాంధ్రలో ఎక్కడ కూడా వర్షపాతం నమోదు కాలేదు. ఇలాఉండగా కరీంనగర్ జిల్లాలోని రామగుండంలో అత్యధిక ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్ నమోదైందని ఐఎండి ప్రకటించింది.