రాష్ట్రీయం

ఎవరి పట్టు వారిదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 13:కాపునేత ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహారదీక్ష శాంతిభద్రతల సమస్యగా మారే ప్రమాదం కనిపిస్తోంది. ప్రభుత్వం ఇప్పటివరకూ చర్చలకు వెళ్లకపోవడం, ముద్రగడ ఆహారం తీసుకోవడానికి, వైద్య సేవలకు నిరాకరించడం కాపువర్గంలో కలవరం కలిగిస్తున్నాయి. తాజాగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లోనూ కాపు నేతల నిరసనలు విస్తరించడం చూస్తే, భవిష్యత్తు పరిణామాలు నవ్యాంధ్రపై ప్రభావం చూపుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ముద్రగడ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టి ఐదురోజులవుతున్నా, ఇప్పటివరకూ ప్రభుత్వం ఆయన దీక్ష విరమణకు చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశమయింది. గతంలో కాపు వర్గానికి చెందిన ఎమ్మెల్యేతోపాటు, అచ్చెన్నాయుడును ముద్రగడ వద్దకు పంపిన ప్రభుత్వం, ఇప్పుడు వ్యూహం మార్చి ముద్రగడపై ఎదురుదాడి చేయించడంతో కాపులను రెచ్చగొట్టినట్టయింది. సొంత కులం వారితో ముద్రగడను తిట్టించడాన్ని, టిడిపిలోని కాపులే సహించలేకపోతున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో టిడిపికి చెందిన 200 మంది కాపులు పార్టీకి రాజీనామా చేశారు. దీన్నిబట్టి ఆ పార్టీలోని కాపులకు సైతం, ముద్రగడపై నాయకత్వం అనుసరిస్తోన్న వైఖరి మింగుడుపడటం లేదని స్పష్టమవుతోంది. ముద్రగడ తలను గోడకేసి కొట్టుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించడంతో కాపుల్లో ఆగ్రహం మరింత పెరుగుతోంది. ఇప్పటికే మద్రగడ కొడుకును పోలీసులు కొడుతున్న ఫొటోలతో రగిలిపోతున్న కాపులను, తాజా వీడియా దృశ్యాలు మరింత రెచ్చగొట్టినట్టయింది. దానితో ప్రభుత్వం రాజమండ్రి ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో సిగ్నల్స్ లేకుండా చేసినట్లు సమాచారం. ముద్రగడ కొడుకును పోలీసులు కొట్టలేదని హోంమంత్రి స్పష్టం చేయగా, కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిజిపిని కోరామని టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మీడియాకు చెప్పడం గమనార్హం.
తాజాగా ముద్రగడ విషయంలో ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఆలిండియా కాపుజాగృతి కన్వీనర్, సుప్రీంకోర్టు న్యాయవాది గల్లా సతీష్, కాపు సద్భావనా సంఘం మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఆయన ఇదే అంశంపై హైకోర్టును కూడా ఆశ్రయించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో శాంతిభద్రతలు ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడినట్లు కనిపిస్తోంది. ఆయనకు ఏదైనా జరిగితే రాష్ట్రంలో గతంలో మాదిరిగా, మళ్లీ కులఘర్షణలు మొదలయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన అన్ని వర్గాల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠకు పోకుండా, నవ్యాంధ్ర భవిష్యత్తు, పెట్టుబడులను దృష్టిలో ఉంచుకుని ముద్రగడ వ్యవహారానికి తెరదించాలంటున్నారు. శాంతిభద్రతలు సవ్యంగా లేకపోతే పెట్టుబడులు రావని, అభివృద్ధి అడుగులేస్తున్న ఈ సమయంలో శాంతిభద్రతలు, కుల ఉద్యమాలు జరిగితే అది రాష్ట్రానికే నష్టమంటున్నారు. రాష్ట్రంలో అశాంతి, అలజడి మొదలైతే అది ప్రతిపక్షానికే ఉపయోగమని, ఇప్పటికే తాము ముద్రగడకు వ్యతిరేకంగా ఉన్నామన్న భావన కాపుల్లో బలంగా ఉన్నందున, నష్టనివారణకు దిగాలని మంత్రులు కూడా అభిప్రాయపడుతున్నారు. ముద్రగడ దీక్షను అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్థిపొందేందుకు కాంగ్రెస్, వైసీపీకి చెందిన కాపు అగ్రనేతలంతా హైదరాబాద్ పార్కు హయత్‌లో భేటీ కావడం మరింత ఉత్కంఠభరితంగా మారిందని టిడిపి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకత్వ నిర్ణయాలు వైసీపీకి లబ్థి కలిగించేలా ఉన్నాయన్న అభిప్రాయం టిడిపి శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ‘ఈ పరిస్థితిలో కావలసింది సంయమనం. మేమే రెచ్చగొట్టేలా మాట్లాడితే ఎలా? ముద్రగడను విమర్శిస్తే కాపులు భరించేందుకు సిద్ధంగా లేరని తెలిసినా మా వాళ్లు రెచ్చగొడుతూ వాతావరణాన్ని చెడగొడుతున్నారు. మా సారుకు ఈ సలహాలు ఎవరిస్తున్నారో అర్ధం కావడం లేదని’ ఒక మంత్రి వ్యాఖ్యానించారు.
ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై చానెళ్లలో వస్తున్న వార్తలు కాపులలో టెన్షన్ పెంచుతున్నాయి. ఇప్పటికే ఒకసారి బంద్ పిలుపు ఇవ్వగా, తాజాగా చలో రాజమహేంద్రితో కాపులు తరలివెళుతున్నారు. ఇప్పటివరకూ స్తబ్దతగా ఉన్న గుంటూరు, కృష్ణా, ఉత్తరాంధ్ర కాపులు తాజా పరిణామాలతో రగిలిపోతున్నారు.