రాష్ట్రీయం

10 కాదు.. 15 లక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 13: వయోధిక పాత్రికేయుడు, తొలితరం తెలంగాణ పాత్రికేయ ఉద్యమకారుడు, రచయిత కెఎల్ రెడ్డిని అన్ని విధాలుగా ఆదుకోవడానికి సిఎం కె చంద్రశేఖర్‌రావు రూ. 15 లక్షల ఆర్థిక సహాయం అందించారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం కెఎల్ రెడ్డిని స్వయంగా పిలిపించుకొని ముఖ్యమంత్రి చెక్ అందజేశారు. తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక సామాజిక అంశాలపై అక్షర సమరం సాగిస్తున్న కెఎల్ రెడ్డి ప్రస్తుతం అనారోగ్యంతో బాధ పడుతున్న విషయాన్ని ‘ఆంధ్రభూమి’ దిన పత్రిక ఆదివారం ప్రచురించింది. ఈ ప్రత్యేక వ్యాసాన్ని చదివిన సిఎం వెంటనే స్పందించి కెఎల్ రెడ్డిని క్యాంపుఆఫీసుకు ఆహ్వానించి, యోగ క్షేమాలు
అడిగి తెలుసుకున్నారు. వైద్య ఖర్చులు, ఇతర అవసరాల కోసం రూ.15 లక్షల చెక్కును అందించారు. ఏడు దశాబ్దాలుగా పాత్రికేయ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఈ సహాయం అందిస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. 85 ఏళ్ల వయసున్న కంచర్ల లక్ష్మారెడ్డి (కెఎల్ రెడ్డి) నల్లగొండ జిల్లాకు చెందిన వారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటూ వృద్ధాప్యంలో కూడా పాత్రికేయ వృత్తిని కొనసాగిస్తున్నారు.
ఇలాంటి సిఎంను చూడలేదు: కెఎల్ రెడ్డి
‘ఇలాంటి సిఎంను మునుపెన్నడూ నేను చూడలేదు’ అని కెఎల్ రెడ్డి అన్నారు.ముఖ్యమంత్రి నుంచి ఆర్థిక సహాయం అందుకున్న వెంటనే తన గురించి కథనం ప్రచురించిన ఆంధ్రభూమి సంపాదకుడు ఎంవి ఆర్ శాస్ర్తీకి ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కెసిఆర్ స్పందన చూడగానే గజేంద్ర మోక్షంలో ‘రావే ఈశ్వర! కావే వరద, సంరక్షింపు భద్రాత్మకా!’ అనే పద్యం గుర్తుకు వచ్చిందన్నారు. తన భక్తుడి మొర వినగానే ఉన్నపళంగా పరిగెత్తుకొచ్చిన ఈశ్వరుడిలా సిఎం కెసిఆర్ స్పందించారన్నారు. తన సోదరునితో కలిసి సిఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లగా, అక్కడ ఆయన్ను కలువడానికి 20 మందిదాకా ఎదురు చూస్తున్నప్పటికీ, తనను వెంటనే పిలిపించుకొని మాట్లాడారన్నారు. ఆరోగ్యం, యోగ క్షేమాలు విచారించిన తర్వాత ‘మీకు 10 లక్షలు ఇస్తున్నాను’ అని ముఖ్యమంత్రి చెప్పారన్నారు. ఎంతిచ్చినా దాని ద్వారా నెలకు 10 వేల రూపాయలు వచ్చేటట్టు చూడండని అడిగానని కెఎల్ రెడ్డి చెప్పారు. 10 లక్షలు బ్యాంకులో వేస్తే ఎంత వస్తుందని ముఖ్యమంత్రి అక్కడున్న అధికారిని అడుగగా, 8 వేలు వస్తుందని చెప్పారన్నారు. తనకు నెలకు అయ్యే ఖర్చులో మరో 2 వేలు తక్కువ అవుతుందని దాని కోసం మరేదైనా చిన్న ఉద్యోగం చేస్తానని చెప్పానన్నారు. ఇక నుంచి ఏ ఉద్యోగం చేయనవసరం లేదు, అంత కంటే ఎక్కువే వచ్చేలా రూ. 15 లక్షలు ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారన్నారు. ఆ మొత్తాన్ని బ్యాంకులో వేస్తే దానిపై నెలకు 12 వేల వడ్డీ వస్తుందని అక్కడున్న అధికారి ఒకరు వివరించినట్టు కెఎల్ రెడ్డి తెలిపారు. ఇలా ఉండగా తాను సిఎంను కలువడానికి వెళ్లినప్పుడు మంత్రి జగదీశ్వర్‌రెడ్డి కూడా అక్కడ ఉన్నారని అన్నారు. ఈయన మీకు చుట్టమే అవుతారు తెలుసా అని అడిగిన ముఖ్యమంత్రి ఎప్పుడైనా ఆయన వద్దకు వెళ్లారా అని కూడా అడిగారని అయితే ఆయన వద్దకు వెళ్లాల్సిన అవసరం ఎప్పుడు పడలేదని చెప్పానన్నారు. మీరు చేసిన సహాయంతో ఇక నుంచి ఏ ఉద్యోగం చేయకుండా జర్నలిజంపై పుస్తకాలు రాసుకుంటాని చెప్పానని కెఎల్ రెడ్డి తెలిపారు. జర్నలిజమ్‌పైనే కాకుండా తెలంగాణ చరిత్ర గురించి పుస్తకాలు రాయండని ముఖ్యమంత్రి కోరారని అన్నారు.

చిత్రం సీనియర్ జర్నలిస్ట్ కెఎల్ రెడ్డికి ఆర్థిక సాయంగా చెక్కు అందిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్