రాష్ట్రీయం

కారెక్కేస్తున్నాం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 13: కాంగ్రెస్, సిపిఐ పార్టీలకు పెద్ద కుదుపు. నల్లగొండ జిల్లాలో తెరాసకు గట్టి మద్దతు లభించింది. హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లోనూ పట్టు సాధించిన తెరాసకు నల్లగొండ జిల్లాయే ఇప్పటి వరకూ సమస్యగా ఉంది. ఇప్పుడు ఆ జిల్లా నుంచి ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు కారెక్కేస్తుండటంతో, జిల్లాలో తెరాసకు తిరుగులేని మద్దతు లభించినట్టయ్యింది. కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, దేవరకొండ సిపిఐ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్‌లు తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నారు. మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్‌లు, ఇతర కాంగ్రెస్ నేతలంతా ఈనెల 15న తెలంగాణ భవన్‌లో జరిగే కార్యక్రమంలో తెరాస తీర్థం తీసుకుంటారు. మాజీ ఎంపీ వివేక్ నివాసంలో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, సిపిఐ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్, మాజీ ఎంపి వివేక్, మాజీ మంత్రి వినోద్, జువ్వాడి నర్సింగ్‌రావులు సోమవారం వివేక్ నివాసంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తామంతా తెరాసలో చేరుతున్నట్టు ప్రకటించారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకే తెరాసలో చేరుతున్నట్టు వెల్లడించారు.
తొలిసారి వామపక్ష ఎమ్మెల్యే..
ఇప్పటివరకు వివిధ రాజకీయ పార్టీల నుంచి నేతలు తెరాసలో చేరినా, తొలిసారి వామపక్షాల నుంచి ఎమ్మెల్యే పార్టీ మారుతున్నారు. శాసన సభలో సిపిఐ, సిపిఎం పార్టీలకు ఒక్కో సభ్యుడున్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజక వర్గం నుంచి గెలిచిన రవీంద్రనాయక్ నియోజక వర్గం అభివృద్ధి కోసం టిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు చెప్పారు.
కాంగ్రెస్ బలహీనపడుతోంది: గుత్తా
కాంగ్రెస్ పరిస్థితి రాష్ట్రంలో దయనీయంగా మారిందని, రోజురోజుకు బలహీనపడుతోందని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత కలహాలు మనోవేదనకు గురి చేశాయన్నారు. రాష్ట్భ్రావృద్ధిలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు సహకరించాలనే ఉద్దేశంతోనే తెరాసలో చేరుతున్నట్టు చెప్పారు. ఎంపీగా తనకు కాంగ్రెస్ రెండుసార్లు అవకాశం ఇచ్చిందని కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంటు సభ్యత్వానికి అవసరమైతే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. మిషన్ భగీరథ, కాకతీయ పథకాలు అవినీతి మయం అంటూ గతంలో చేసిన ఆరోపణల గురించి విలేఖరులు ప్రశ్నించగా, ఈ పథకాలకు సంబంధించి అనుమానాలు నివృత్తి అయ్యాయన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తానని చెప్పారు. యాదాద్రి పవర్ ప్లాంట్, డిండి ఎత్తి పోతల పథకం పూర్తి చేసేందుకు పూర్తిగా సహకారం అందించనున్నట్టు తెలిపారు. తెరాసలో చేరాలని అంతా కలిసే నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
గిరిజనాభివృద్ధిని చూసి..: రవీంద్రనాయక్
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, రెండేళ్లలో దేవరకొండ నియోజక వర్గంలో గతంలో ఎప్పుడూలేని స్థాయిలో అభివృద్ధి సాధించినట్టు సిపిఐ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ తెలిపారు. దేవరకొండ అభివృద్ధికి ప్రభుత్వం మూడు వందల కోట్లు కేటాయించిందన్నారు. తెలంగాణ అభివృద్ధికి సిఎం కెసిఆర్ నాయకత్వాన్ని బలపరచాల్సి ఉందని, అందుకే తాను తెరాసలో చేరుతున్నట్టు చెప్పారు. సిఎం కెసిఆర్‌ను తాను ఎప్పుడూ కలువలేదని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సిఎం చూపుతున్న ఆసక్తి నచ్చిందన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి సిఎం కెసఆర్ వల్లే సాధ్యమన్నారు. కాంగ్రెస్‌ను వీడి తెరాసలో చేరుతున్న తాను ఏమీ మాట్లాడలేకపోతున్నట్టు మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే భాస్కర్‌రావు తెలిపారు.
రాష్ట్భ్రావృద్ధి కోసమే: వివేక్, వినోద్
తెలంగాణ అభివృద్ధి కోసమే తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నట్టు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్ తెలిపారు. తమ తండ్రి జి వెంకటస్వామి ఆశయాల సాధనకు తెరాసలో చేరుతున్నట్టు చెప్పారు. తెరాస నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ గొప్ప మనసుతో తెలంగాణ ఇచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. తాము తెరాసలో ఉన్నప్పుడు కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే, తాము తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తామని చెప్పామని, తెలంగాణ ఇచ్చినందుకు మాట నిలబెట్టుకుని కాంగ్రెస్‌లో చేరామన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసమే ఇప్పుడు తెరాస పార్టీలో చేరుతున్నట్టు వివేక్, వినోద్‌లు వెల్లడించారు. రాష్ట్భ్రావృద్ధి విషయంలో కెసిఆర్‌కు సహకరిస్తామని చెప్పారు. రాష్ట్భ్రావృద్ధికి అంతా కలిసి రావాలని, అంతా సహకరించాలని కెసిఆర్ కోరినట్టు చెప్పారు.

చిత్రం తెరాసలో చేరబోతున్నట్టు ప్రకటించి సమావేశ మందిరం నుంచి బయటకు వస్తున్న కాంగ్రెస్, వామపక్ష నేతలు