రాష్ట్రీయం

ముద్రగడ ఆరోగ్యం ఆందోళనకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 13: నిరాహార దీక్ష కొనసాగిస్తున్న మాజీ మంత్రి, కాపు ఉద్య మ నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో కొనసాగిస్తున్న దీక్ష సోమవారం ఐదో రోజుకు చేరుకుంది. బలవంతంగానైనా ఆయనకు వైద్య సేవలు అందించాల్సిందేనని, లేదంటే ఆరోగ్యం మరింత క్షీణించే ప్రమాదముందని వైద్యులు ప్రకటించారు. సోమవారం ఉదయం యథావిథిగా ముద్రగడకు వైద్యం అందించడానికి డాక్టర్లు ప్రయత్నించగా ఆయన నిరాకరించారు. ముద్రగడ సతీమణి పద్మావతి, కోడలు సిరికి ఆదివారం సెలైన్ ఎక్కించినప్పటికీ, సోమవారం వారు కూడా వైద్య పరీక్షలకు నిరాకరించారని ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ కిషోర్ చెప్పారు. ఇదిలాఉండగా ముద్రగడకు ఎటువంటి ప్రమాదకర పరిస్థితి ఎదురుకాకూడదని జిల్లావ్యాప్తంగా కాపు సామాజికవర్గ నేతలు, మహిళలు వివిధ ఆలయాల్లో పూజలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా సోమవారం కూడా నిరసనలు, అరెస్టు లు కొనసాగాయి. జిల్లాలో సెక్షన్ 144, సెక్షన్ 30 అమల్లో ఉంది. సోమవారం చలో రాజమహేంద్రవరం కార్యక్రమానికి పిలుపునిచ్చారనే వార్తల నేపథ్యంలో మొత్తం నగరాన్ని పోలీసు వలయంగా మార్చివేశారు.
ప్రభుత్వం మెట్టు దిగాలి : ఎమ్మెల్యే ఆకుల
చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని, ప్రస్తుత పరిస్థితిని అత్యవసరంగా పరిగణించి రాష్ట్ర గవర్నర్ చొరవ తీసుకుని చర్చలకు తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశానని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముద్రగడ ఆరోగ్యం బాగా క్షీణించిందని, తక్షణం వైద్య పరీక్షలు చేయించుకోవాలని తాను విజ్ఞప్తిచేశానని, అయితే ఆయన నిరాకరించారని తెలిపారు. ప్రభుత్వం ఒక మెట్టుదిగి చర్యలకు ముందుకు రావాలని కోరుతున్నానన్నారు.