రాష్ట్రీయం

తెలంగాణకు ఏపీ సిబ్బంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 13: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగుల ఆందోళనకు ఎట్టకేలకు రెండు రాష్ట్రాలు స్పందించాయి. దీంతో తెలంగాణ ఉద్యోగులను ఆంధ్ర ప్రభుత్వం సోమవారం రిలీవ్ చేసింది. వారందరనీ విధుల్లో చేర్చుకోవాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం వెనువెంటనే ఉత్తర్వులు జారీ చేయడంతో ఆందోళనకు తెరపడింది. ఉద్యోగుల పంపిణీలో భాగంగా తెలంగాణకు చెందిన 650మంది క్లాస్-3, క్లాస్-4 ఉద్యోగులు తాత్కాలిక సర్దుబాటులో ప్రస్తుతం ఆంధ్ర సచివాలయంలో పని చేస్తున్నారు. ఉద్యోగుల పంపిణీ సందర్భంగా క్లాస్-3, క్లాస్-4 సిబ్బందిని వారి సొంత రాష్ట్రాలకే కేటాయించాలని కమలానాథన్ కమిటీ సూచించింది. దీంతో ఆంధ్ర సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బంది గత నాలుగు రోజులుగా తమను రిలీవ్ చేసి తెలంగాణ సచివాలయానికి పంపించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. అయితే వీరి ఆందోళన పట్ల రెండు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడంతో ఆందోళన ఉద్ధృతమైంది. వీరికి ఇతర ఉద్యోగ సంఘాలూ సంఘీభావం తెలిపాయి. దీంతో క్లాస్-4కు చెందిన 233మంది ఉద్యోగులను ఆంధ్ర ప్రభుత్వం రిలీవ్ చేసింది. వీరిని వెంటనే విధుల్లో చేర్చుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించినప్పటికీ అఫిడవిట్ ఇవ్వాలని షరతులు విధించింది. పోస్టుల ఖాళీల ఆధారంగా సచివాలయంలోనే కాకుండా ఎక్కడ నియమించినా పని చేస్తామని అఫిడవిట్ ఇచ్చి విధుల్లో చేరాలని షరతు పెట్టింది. దీనికి ఉద్యోగులు అంగీకరించారు. తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించిన ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు తెలంగాణ సచివాలయ క్లాస్ -4 ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్ కృత్ఞతలు తెలిపారు. ప్రభుత్వం కోరిన విధంగా అఫిడవిట్ ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.